NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష దగ్గర పడుతోంది. సరిగ్గా వచ్చే ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదలవుతాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2025, 11:39 AM IST
NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ యూజీ 2025 పరీక్ష జరగనుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ జారీ కాగా ఇక అడ్మిట్ కార్డులు విడుదల కావల్సి ఉన్నాయి. అడ్మిట్ కార్డుల్ని సులభంగా ఇలా neet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. 

Add Zee News as a Preferred Source

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి యేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష 2025 మే 4వ తేదీ ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పరీక్ష ఏ నగరంలోనే తెలిపే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేసింది. ఇక విద్యార్ధులు అడ్మిట్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. నీట్ యూజీ 2025 పరీక్ష అడ్మిట్ కార్డులు మే 1వ తేదీన విడుదల కానున్నాయి. అడ్మిట్ కార్డుల్ని neet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఎన్టీఏ అధికారిక సైట్ ఓపెన్ చేసి అందులో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే చాలు మీ అడ్మిట్ కార్డు ప్రత్యక్షమౌతుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. 

మే 4వ తేదీన నీట్ పరీక్ష 2 గంటలకే అయినా మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది. ఎందుకంటే చివరి నిమిషంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. విద్యార్ధులు తమ వెంట నీట్ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ, ఏదైనా గుర్తింపు కార్డు, ఫోటోలు మాత్రమే వెంట తీసుకెళ్లాలి. ఇతర ముఖ్యమైన సూచనలు అడ్మిట్ కార్డులో ఉంటాయి. వాటి ప్రకారం ఫాలో అవాలి. 

నీట్ యూజీకు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం అభ్యర్ధులు ఎన్టీఏ హెల్ప్ డెస్క్ 011-40759000, 011-69227700 ను సంప్రదించవచ్చు. లేదా neetug2025@nta.ac.in కు మెయిల్ చేయవచ్చు. 

Also read: Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. పహల్గాం ఘటన మరువమందే అటాక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News