NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్. నీట్ యూజీ పరీక్షలో కీలకమైన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసింది. నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల్ని సులభంగా ఇలా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2025, 11:06 AM IST
NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 పరీక్ష సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా మే 4వ తేదీన జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ వెలువడింది. నీట్ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్‌‌సైట్ https://neet.nta.nic.in/ నుంచి సులభంగా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

దేశవ్యాప్తంగా వివిధ వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష మే 4వ తేదీన జరగనుంది. మే 1న నీట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. అంతకంటే ముందు నీట్ పరీక్షకు ఏ నగరం కేటాయించారనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా తెలియజేస్తుంటుంది ఎన్టీఏ. ఒకవేళ దూర ప్రాంతమైతే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్ ముందుగా విడుదలవుతుంది. అందులో సెంటర్ పేరు ఉండదు కానీ సెంటర్ ఏ నగరంలో అనేది ఉంటుంది. వాస్తవానికి ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఏప్రిల్ 26న విడుదల కావల్సి ఉంది. కానీ ఎన్టీఏ ఇవాళ ఏప్రిల్ 24న అంటే రెండు రోజుల ముందే వీటిని జారీ చేసింది. 

నీట్ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ ఓపెన్ చేయాలి. అందులో అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్ యూజీ 2025 అనే లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తరువాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో నీట్ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా నమోదు చేస్తే చాలు. నీట్ యూజీ 2025 పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ ప్రత్యక్షమౌతుంది. డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. 

నీట్ యూజీ 2025 పరీక్ష మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. మద్యాహ్నం 1.30 గంటల తరువాత గేట్లు మూసివేస్తారు. ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు విద్యార్ధులు ముందుగానే అంటే 11 గంటలకు రిపోర్ట్ చేయాలని ఎన్టీఏ సూచిస్తోంది. 

Also read: Pahalgam Attack LIVE: ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. మోదీ మాస్టర్ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News