NEET UG 2025: ఆధార్ మ్యాచ్ కాకపోతే నీట్ పరీక్ష వదులుకోవాల్సిందే, తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్

NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష రాస్తున్నారా..అయితే మీ ఆధార్ కార్డు వివరాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకోండి. లేకపోతే ఏకంగా పరీక్ష మిస్ కావల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి నీట్ పరీక్ష చాలా కట్టుదిట్టంగా ఉండబోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 02:51 PM IST
NEET UG 2025: ఆధార్ మ్యాచ్ కాకపోతే నీట్ పరీక్ష వదులుకోవాల్సిందే, తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్

NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష దగ్గర పడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 4వ తేదీన నీట్ యూజీ 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మీరు కూడా నీట్ పరీక్షకు సిద్ధమౌతుంటే ఎన్టీఏ జారీ చేసిన ఈ సూచనలు మీ కోసమే. ఎందుకంటే ఈసారి పరీక్షలో వెరిఫికేషన్ చాలా కఠినంగా ఉండనుంది. 

Add Zee News as a Preferred Source

నీట్ యూజీ 2025 పరీక్షకు అంతా సిద్ధమౌతోంది. గత ఏడాది జరిగిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నీట్ పరీక్ష కేంద్రాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మీ ఆధార్ కార్డు వివరాలు సరిపోల్చకుండా ఉంటే మాత్రం వెరిఫికేషన్ ప్రక్రియ ఫెయిల్ అవుతుంది. అదే జరిగితే నీట్ పరీక్షకు దూరం కావల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కఠినమైన పరిశీలన ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆధార్ కార్డు వివరాలు ధృవీకరణ కాకపోతే పరీక్షకు హాజరు కాలేరు. గతంలో వేషధారణ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇందులో ఫెయిల్ అయితే పరీక్షకు హాజరుకాలేరు. 

ఈసారి ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

ఇదంతా ఎందుకంటే నీట్ యూజీ 2024 పరీక్షలో బీహార్‌లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తేలింది. పూర్నియాలో కొంతమంది అభ్యర్ధులు ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేసింది. 

నీట్ అభ్యర్ధులకు ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఏప్రిల్ 26న జారీ అవుతుంది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో పుట్టిన తేదీ, అప్లికేషన్ నెంబర్ వివరాలు నమోదు చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ పొందవచ్చు. ఇక మే 1వ తేదీ నీట్ యూజీ 2025 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. గతంలో పరీక్ష నిర్వహణకు ప్రైవేట్ కళాశాలల్ని కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహించనుంది. నీట్ దరఖాస్తులో ఇచ్చిన వివరాలతో ఆధార్ సమాచారం సరిపోవాలి. లేకపోతే పరీక్షకు అనుమతించరు. అందుకే ప్రతి విద్యార్థి తమ ఆధార్ కార్డు అప్‌డేట్ ఉందో లేదో చూసుకోవాలి. 

Also read: NEET UG 2025 Rules: నీట్ పరీక్షకు నిబంధనలు, ఆంక్షలు, తప్పక పాటించాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News