NEET UG 2025 Updates: రేపే నీట్ యూజీ 2025 పరీక్ష, ముఖ్యమైన సూచనలు, డ్రెస్ కోడ్, ఏం చేయాలి, ఏం చేయకూడదు

NEET UG 2025 Updates: దేశవ్యాప్తంగా మరి కొద్ది గంటల్లో నీట్ యూజీ 2025 పరీక్ష ప్రారంభం కానుంది. ఇప్పటికే నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. నీట్ పరీక్ష సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేటికి అనుమతి ఉంటుంది. వేటికి ఉండదనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2025, 04:57 PM IST
NEET UG 2025 Updates: రేపే నీట్ యూజీ 2025 పరీక్ష, ముఖ్యమైన సూచనలు, డ్రెస్ కోడ్, ఏం చేయాలి, ఏం చేయకూడదు

NEET UG 2025 Updates: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2025 పరీక్షకు అంతా సిద్ధం చేసింది. రేపు మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ యూజీ 2025 పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి సూచనలు పాటించాలి, ఏవి చేయవచ్చు, ఏవి చేయకూడదనే వివరాలు ఓసారి తెలుసుకుంటే మంచిది. 

Add Zee News as a Preferred Source

నీట్ యూజీ 2025 పరీక్ష మే 4 ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్ష దేశంలోనూ, విదేశాల్లోనూ కలిపి 566 కేంద్రాల్లో జరగనుంది. పూర్తిగా పేపర్ పెన్సిల్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఎన్టీఏ విధించిన కొన్ని కఠినమైన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో హడావిడి, ఒత్తిడి తప్పించుకునేందుకు అడ్మిట్ కార్డులో ఇచ్చిన నిబంధనలు, సూచనలు తప్పకుండా ఫాలో అయితే మంచిది. 

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు బయో బ్రేక్స్ ఉంటాయి కానీ పరీక్ష మొదలైన మొదటి గంట, చివరి అర గంటలలో ఉండవు. అంటే మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మాత్రమే బయో బ్రేక్స్‌కు అనుమతి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అందరినీ ఒకేసారి వదులుతారు. 

నీట్ యూజీ పరీక్ష కేంద్రాలన్నీ పూర్తిగా సీసీటీవీ కెమేరాల పర్యవేక్షణ, జామర్లతో ఉంటాయి. నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులను పూర్తిగా మెటల్ డిటెక్షర్లతో పరీక్షిస్తారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పకుండా ఉంటుంది. నీట్ పరీక్షకు పేపర్, పెన్, పెన్సిల్, పౌచ్, జియామెట్రి బాక్స్, స్కేల్ వంటివాటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. కాలిక్యులేటర్, కెమేరాలు, ఎలక్ట్రానిక్ పెన్నులు, స్కానర్లకు అనుమతి లేదు. అదే విధంగా బ్యాగ్స్, బెల్టులు, క్యాప్స్, గూగుల్స్, వాలెట్స్ అనుమతించరు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, ఫిట్‌‌నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్లు, పేజర్లు లోపలకు తీసుకెళ్లకూడదు. 

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటో అడ్మిట్ కార్డుకు అంటించి వెంట తీసుకెళ్లాలి. అదనంగా మరో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రాల గేట్లు ఉదయం 11 గంటలకు తెర్చుకుంటాయి. మద్యాహ్నం 12 గంటల నుంచి పరీక్ష హాలులో అనుమతిస్తారు. మద్యాహ్నం 1.15 గంటలకు సీటులో కూర్చొంటారు. మద్యాహ్నం 1.30 గంటల తరువాత లోపలకు అనుమతి ఉండదు. మద్యాహ్నం 1.30 గంటల నుంచి 1.45 గంటల వరకు ముఖ్యమైన సూచనలు అందిస్తారు. ఆ తరువాత మద్యాహ్నం 1.45 గంటలకు బుక్‌లెట్స్ పంపిణీ ఉంటుంది. 1.50 కు విద్యార్ధులు అవసరమైన సమాచారం నింపాలి. మద్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమౌతుంది. 

Also read: IPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేసులో నిలిచే నాలుగు జట్లు ఏవో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News