NEET UG 2025 Exam Alert: నేడే నీట్ పరీక్ష ఈ రూల్స్ పాటిస్తేనే ఎంట్రీ

NEET UG 2025 Exam Alert: దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2025 పరీక్ష మరి కాస్సేపట్లో జరగనుంది. దేశంలోనే అతి పెద్ద ప్రవేశ పరీక్ష ఇది. దేశంలోని వైద్య విద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఎన్టీఏ ప్రతి ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2025, 08:46 AM IST
NEET UG 2025 Exam Alert: నేడే నీట్ పరీక్ష ఈ రూల్స్ పాటిస్తేనే ఎంట్రీ

NEET UG 2025 Exam Alert: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తుంటుంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్ష మరి కాస్సేపట్లో ప్రారంభం కానుండటంతో అన్ని పరీక్ష కేంద్రాల్లో పగడ్బందీ  ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎంత మంది విద్యార్ధులు ఈసారి నీట్ యూజీ పరీక్ష రాస్తున్నారు, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష ఇవాళ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్ధులు ఈసారి పరీక్ష రాయనున్నారు. నీట్ యూజీ పరీక్ష ద్వారా మొత్తం 780 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,18,1980 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కానున్నాయి. ఆ తరువాత 323 కళాశాలల్లో 27,618 బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తారు. ఇక బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఏఎంఎస్ కోర్సుల్లో 55,851 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా బీఎస్సీ నర్శింగ్ కోర్సులు కూడా నీట్ ద్వారానే భర్తీ అవుతాయి. 

నీట్ పరీక్ష సమయం నియమ నిబంధనలు

నీట్ పరీక్ష మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. మద్యాహ్నం 1.30 గంటలు దాటి అర నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు. ఉదయం 11 గంటల నుంచి లోపలకు అనుమతిస్తారు. మద్యాహ్నం 1.15 గంటలకు సీట్లలో కూర్చొంటారు. ఆ తరువాత 1.30 నుంచి 1.45 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు ఇచ్చి అడ్మిట్ కార్డులు తనిఖీ చేస్తారు. మద్యాహ్నం 1.45 గంటలకు బుక్ లెట్స్ ఇస్తారు. 1.50 గంటలకు అందులో ఉన్న ప్రాధమిక వివరాలు నింపాలి. 

ఏవి తీసుకెళ్లవచ్చు, ఏవి తీసుకెళ్లకూడదు

విద్యార్ధులు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్, జిరాక్స్ రెండూ తీసుకెళ్లాలి. ఆడ్మిట్ కార్డులపై సెల్ఫ్ డిక్లరేషన్ పూర్తి చేసి పోస్ట్‌కార్డ్ సైజ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఎడమ చేతి బొటనవేలు ముద్ర వేయాలి. విద్యార్థి సంతకం మాత్రం ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయాలి. వాటర్ బాటిల్ పూర్తి పారదర్శకంగా ఉండేది తీసుకెళ్లవచ్చు. మరో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, పెన్, పెన్సిల్ ఏవీ తీసుకెళ్లకూడదు.

విద్యార్ధులు బరువైన, పొడవాటి చేతుల దుస్తులు ధరించకూడదు. హై హీల్స్ చెప్పులు, బూట్లు వేసుకోకూడదు. రెలిజియస్ దుస్తులు వేసుకునే విద్యార్ధులు మాత్రం మద్యాహ్నం 12.30 గంటలకే చేరుకుని ప్రత్యేక చెకింగ్ నిర్వహించుకోవాలి. మీ పరీక్ష కేంద్ర ఎంత దూరంలో ఉందో చూసుకుని ట్రాఫిక్, వాతావరణం ఇతర పరిస్థితుల్ని అంచనా వేసుకుని తగిన సమయంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాలి. 

ఓఎంఆర్ షీట్‌లో రూల్ నెంబర్, టెస్ట్ బుక్‌లెట్ నెంబర్, పేపర్ కోడ్ తప్పకుండా పూరించాలి. ఓవర్ రైటింగ్ చేయకూడదు. మరో ఓఎంఆర్ ఇవ్వరు. తప్పు దొర్లితే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలి. 

Also read: NEET UG 2025 Updates: రేపే నీట్ యూజీ 2025 పరీక్ష, ముఖ్యమైన సూచనలు, డ్రెస్ కోడ్, ఏం చేయాలి, ఏం చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News