NEET UG 2025 Rules: దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష మరి కొద్ది రోజుల్లో జరగనుంది. మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఆఫ్‌లైన్ మోడ్లో జరుగుతున్న ఏకైక పరీక్ష ఇదే. అందుకే రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఆ నిబంధనలు ఏంటనేది ఓసారి తెలుసుకుందాం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 4న నీట్ యూజీ 2025 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్ష ఉంటుంది. ఇతర పరీక్షల కంటే కఠినంగా నిబంధనలు ఉంటాయి. విద్యార్ధుల వస్త్రధారణ, ఆభరణాలపై కూడా ఆంక్షలు ఉంటాయి. ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏమేం తీసుకెళ్లవచ్చు, ఏం తీసుకెళ్లకూడదు, ఎన్ని గంటల వరకు అనుమతిస్తారనే వివరాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో 65 వేలమది విద్యార్ధులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది వరకూ ఈ పరీక్ష రాస్తున్నారు.
నీట్ నిబంధనలు, ఆంక్షలు ఇవే
నీట్ యూజీ 2025 పరీక్ష మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. మద్యాహ్నం 1.30 గంటల తరువాత ఎవర్నీ అనుమతించరు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలకు పంపించరు. ప్రతి విద్యార్ధిని మెటల్ డిటెక్టర్ పూర్తిగా పరిశీలిస్తారు. పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవడం మంచిది. నీట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్ధులకు ఏ జిల్లాలో లేదా ఏ నగరంలో పరీక్ష కేంద్రం కేటాయించారనే సమాచారం ఈ నెల అంటే ఏప్రిల్ 26న సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా అందుతుంది. మే 1వ తేదీన అడ్మిట్ కార్డులు జారీ అవుతాయి.
ఆంక్షలు
జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్ర ధారణ ఉండకూడదు. సాధారణ దుస్తుల్లోనే రావల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాగ్ గ్లాసెస్ ధరించకూడదు. ముక్కుపుడక, చెవులకు దుద్దులు చేతులకు గాజులు వంటి ఏ ఆభరణాలు ధరించకూడదు. చేతికి స్మార్ట్ వాచ్‌తో పాటు సాధారణ వాచీలు కూడా ధరించకూడదు. పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో గడియారాలు ఏర్పాటు చేస్తారు. బ్లూటూత్ వాచీలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులకు అనుమతి ఉండదు. పరీక్ష రాసేందుకు పెన్నుల్ని పరీక్ష కేంద్రంలో ఇస్తారు.
మద్యాహ్నం 1.30 గంటల వరకు లోపలకు అనుమతిస్తారు. 1.15 గంటల నుంచి ఎవరి సీట్లలో వారు కూర్చోవచ్చు. మద్యాహ్నం 1.30 గంటలకు అందరి అడ్మిట్ కార్డులు తనిఖీ చేసిన తరువాత నిబంధనల్ని పూర్తిగా తెలియజేస్తారు. విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో వెంట తీసుకెళ్లాలి. మరో పాస్‌పోర్టు సైజు ఫోటోను అటెండెన్స్ షీటుపై అతికించాలి.
ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిషన్ కార్డుల్లో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్‌కు అనుమతి ఉంటుంది.
Also read: Anna Lezhneva: అన్నా లెజినోవా తలనీలాలు ఇవ్వకూడదా, వైరల్ అవుతున్న వీడియోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









