NEET UG 2025 Chances: నీట్ 2025లో 420లోపు మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా చెక్ చేసుకోండి

NEET UG 2025 Chances: నీట్ 2025 ఫలితాల తరువాత కటాఫ్ మార్కులు భారీగా తగ్గడంతో విద్యార్ధులు కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారు. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తుందా లేదా అనే సందిగ్దంలో ఉన్నారు. మార్కులు, ర్యాంకుల ఆధారంగా సీటు ఎక్కడొస్తుందోననే సందేహం నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2025, 08:19 PM IST
NEET UG 2025 Chances: నీట్ 2025లో 420లోపు మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా చెక్ చేసుకోండి

NEET UG 2025 Chances: నీట్ 2025 ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యార్ధులు సీటు వస్తుందా రాదా, ఎక్కడొస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆల్ ఇండియా కోటా సీట్లు కాకపోతే స్టేట్ కోటాలో సీట్లు లభిస్తాయనే అంచనాలో ఉన్నారు. అయితే 410 లోపు మార్కులు వస్తే ఈసారి కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

నీట్ ఆల్ ఇండియా, స్టేట్ కౌన్సిలింగ్ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నీట్ 2025 స్కోర్ 420 మార్కులు వస్తే సీటు వస్తుందా లేదా అని చూస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఇప్పుడు 34కు చేరుకోగా సీట్ల సంఖ్య 4090కు పెరిగింది. ఇందులో ఆల్ ఇండియా కోటా 15 శాతం కాగా ఎయిమ్స్ బీబీనగర్ 100, ఈఎస్ఐ సనత్ నగర్ 150 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు 30 ఉండి 4600 సీట్లు ఉన్నాయి. కాళోజి యూనివర్శిటీ ప్రకారం రాష్ట్రంలో 5500 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి 70,259 మంది నీట్ 2025 పరీక్షలు రాయగా, 41,584 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆ సంఖ్య 8 వేలు తగ్గింది. ఇక ఏపీలో 57 వేల మంది రాయగా 36 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఈసారి నీట్ రాసిన వారిలో 400 మార్కులు దాటినవారు దేశవ్యాప్తంగా 2 లక్షల మంది ఉండవచ్చు. తెలంగాణలో జనరల్ కేటగరీలో కన్వీనర్ కోటా సీటు రావాలంటే 410-425 మార్కులు రావల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగరీ అయితే 410 మార్కులు తప్పనిసరి. ఇక ఏపీలో ఏయూ పరిధిలో జనరల్ కేటగరీలో 475-480మార్కులు, ఎస్వీయూ పరిధిలో 465-470 మార్కులు రావల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏదైనా ఎయిమ్స్‌లో సీటు రావాలంటే కనీసం 560 మార్కులు దాటి రావల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్ అయితే 650 మార్కులుండాలి. బీబీనగర్ ఎయిమ్స్ కటాఫ్ మార్కులు 580 ఉండవచ్చు. మంగళగిరి ఎయిమ్స్‌లో 600 కటాఫ్ ఉండాలి. 

తెలంగాణలో...

జనరల్ కేటగరీలో 410-420 మార్కులు
ఈడబ్ల్యూఎస్  410 మార్కులు
బీసీ ఎ 335-355 మార్కులు
బీసీ బి 380-400 మార్కులు
బీసీ సి 350-370 మార్కులు
బీసీ డీ 395-405 మార్కులు
బీసీ ఈ 390-400 మార్కులు
ఎస్సీ 350-365 మార్కులు
ఎస్టీ 360-375 మార్కులు

ఏపీలో..

జనరల్ కేటగరీ ఏయూలో 475-480
ఎస్వీయులో 465-470 మార్కులు
బీసీ ఎ ఏయూ, ఎస్వీయూలో 450-455 మార్కులు
బీసీ బి ఏయూలో 445-450 మార్కులు కాగా, ఎస్వీయూలో 447-452 మార్కులు
బీసీ సి ఏయూలో  450-455 మార్కులు కాగా, ఎస్వీయూలో 405-410 మార్కులు
బీసీ డి ఏయూలో 470-475 మార్కులు కాగా, ఎస్వీయూలో  445-450 మార్కులు
బీసీ ఈ ఏయూలో 400-405 మార్కులు, ఎస్వీయూలో 430-435 మార్కులు
ఎస్సీ ఏయూలో 410-414 మార్కులు, ఎస్వీయూలో 400-410 మార్కులు
ఎస్టీ ఏయూలో 380-390 మార్కులు, ఎస్వీయూలో  370-380 మార్కులు

Also read: 3rd World War: మూడో ప్రపంచయుద్ధం తప్పదా, ఇండియా ఎటు వైపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News