Social Media Tax Rules: ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఇంకమ్ టాక్స్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, ఇంకమ్ టాక్స్ అధికారులు సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ అకౌంట్లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లు, ట్రేడింగ్ అకౌంట్లను తనిఖీ చేసే అధికారాన్ని పొందనున్నారు. సెక్షన్ 247 ప్రకారం, ఇది ట్యాక్స్ ఎగవేతదారుల డిజిటల్ అక్టివిటీపై నిఘా పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ కొత్త టాక్స్ బిల్లు, ఇప్పటి వరకు అమలులో ఉన్న 1961 ఇంకమ్ టాక్స్ చట్టాన్ని భర్తీ చేయనుంది. దీని ద్వారా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి దొంగ లావాదేవీలు, అక్రమ ఆస్తుల గుర్తింపును మరింత సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
ఐటీ శాఖ అధికారి ఏఏ అకౌంట్లను తనిఖీ చేయగలరు?
- సోషల్ మీడియా: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్
- కమెర్షియల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు: WhatsApp, Telegram, Emails
- డిజిటల్ లావాదేవీల డేటా: బ్యాంక్ ఖాతాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ అకౌంట్లు
- డిజిటల్ గ్యాడ్జెట్లు: ల్యాప్‌టాప్, మొబైల్, హార్డ్‌డ్రైవ్‌లు
నిబంధనలకు లోబడి లేనివారికి పరిణామాలు?
ఒక వ్యక్తి తన డిజిటల్ అకౌంట్లను ఐటీ అధికారులకు అందించడానికి నిరాకరిస్తే, అధికారులు ఆన్‌లైన్ సెక్యూరిటీని బ్రేక్ చేసి లావాదేవీల వివరాలను గుర్తించగలరు.
పెద్ద వ్యాపారులకేనా ఈ నిబంధనలు?
ఈ కొత్త నిబంధనలు సాధారణ పన్ను చెల్లింపుదారుల కోసం కాదని, కేవలం ట్యాక్స్ ఎగవేతదారులను గుర్తించేందుకు మాత్రమే అమలు చేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ నిబంధనలన్నీ దాదాపు వ్యాపారులకే వర్తిస్తాయి. కానీ కొంతమంది మాత్రం ఇలా చేయడం వల్ల.. తమకు ప్రైవసీ తగ్గి తగ్గుతుందని వాదిస్తున్నారు. మరి దీని గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అంతేకాదు ఈ నిర్ణయం పైన ప్రజలు ఎలాంటి అభివాదన వ్యక్తం చేస్తారో కూడా చూడాలి.
కొత్త చట్టం వల్ల లాభాలు?
- అక్రమ సంపద, బెనామీ ఆస్తుల గుర్తింపు సులభం
- డిజిటల్ లావాదేవీలపై పకడ్బందీ నిఘా
- క్రిప్టోకరెన్సీ మోసాలను అరికట్టే అవకాశం
మొత్తంగా ఈ కొత్త నిబంధనలు ట్యాక్స్ ఎగవేతను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కానీ, వ్యక్తిగత గోప్యతపై ఏమేరకు ప్రభావం ఉంటుందనేది ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది.
Read more: Pawan Kalyan: పవన్ ఇలాఖాలో బూతు స్టెప్పులతో అమ్మాయిల రచ్చ రంబోలా.. షాకింగ్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









