Motor Vehicles Rules Changed: సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో భాగంగా కీలక సవరణలు చేసింది కేంద్రం. వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. 45 రోజుల్లో చలాన్ కట్టేయాలని తెలిపింది. ఆలస్యమైతే బండి సీజ్ చేసే అవకాశం ఉందని.. ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని కూడా ప్రతిపాదించింది. ఈ కొత్త రూల్స్‌కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కేంద్రం. నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనదారులు నోటీస్ కూడా జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఇక వాహనదారులకు ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీ రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది.
నయా రూల్స్ ఇవే..
వాహనదారులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. 1989 మోటర్ వెహికల్స్ రూల్స్ ప్రకారం కొత్త డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది వరకు 90 రోజులు గడుపు ఉన్న చలాన్ కట్టే విధానానికి చెక్ పెట్టి 45 రోజులుగా చెల్లించాలని పేర్కొంది.
అంతేకాదు 5 చలాన్ల కంటే మించి ఒక బండిపై ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
చలాన్ కట్టకపోతే కొత్త వాహనం రూల్స్ ప్రకారం బండి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది
ఇక మీ బండి పై ఏవైనా చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌లో కూడా జాప్యం జరుగుతుంది
మొత్తానికి ఆర్టిఏ కి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరగవు. వాహనాన్ని కూడా విక్రయించలేరు. లైసెన్స్ లో పేరు, చిరునామా మార్పు వంటివి కూడా కుదరపు.
ఈ నయా రూల్స్‌ను అతిక్రమించి వాహనదారులు వ్యవహరిస్తే మూడు రోజుల్లో వారికి ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు కూడా జారీ చేస్తారు అని కేంద్రం తెలిపింది. దీంతో పాటు వాహన యజమాని నడిపే సమయానికి వేరే వారి వాహనం కొనుగోలు చేస్తే కచ్చితంగా పేరు మార్చాలి. లేకపోతే వాహనం నడిపే వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు.
ప్రధానంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టడానికి ఈ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వాహనదారులు కూడా కచ్చితంగా ఈ కొత్త నిబంధనలు తెలుసుకొని ఉండాలి. వాటిని పాటించడం ఎంతైనా అవసరం. రూల్స్ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. ఇంకా తమ సూచనలు ఈమెయిల్ ద్వారా comments- morth@gov.in పంపవచ్చు అని తెలిపింది. ఈ విధంగా అయిన ట్రాఫిక్ ఉల్లంఘనాలు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది అని కేంద్రం ఆశిస్తోంది.
Also Read: మీ వాహనానికి ఫాస్టాగ్ లేదా? అయితే, మీకు కేంద్రం 2 బంపర్ గుడ్‌న్యూస్‌లు.. టోల్ ఎంత చెల్లించాలంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









