Railway Good News: భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. తిరుపతి - షిర్డీ మధ్య కొత్త రైలు ప్రారంభం

New Train Service Starts From Tirupati To Sainagar Shirdi: రైల్వే శాఖ భక్తులకు తీపి కబురు అందించింది. రెండు ప్రధాన పుణ్యక్షేత్రాల మధ్య భక్తులకు మార్గం సుగమం చేస్తూ రైల్వే శాఖ కొత్త రైలును ప్రకటించింది. ఈ రైలుతో రెండు ప్రధాన ఆలయాల మధ్య భక్తుల రాకపోకల సంఖ్య పెరగనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 9, 2025, 10:57 PM IST
Railway Good News: భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. తిరుపతి - షిర్డీ మధ్య కొత్త రైలు ప్రారంభం

Tirupati To Shirdi Train: భారతదేశంలో అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలు తిరుపతి, షిర్డీ. ఆదాయంలోనూ.. భక్తిభావనలోనూ.. భక్తుల రాకలోనూ ఈ రెండూ ఆలయాలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఈ రెండు ఆలయాల మరింత రాకపోకలు పెరగనున్నాయి. ఇరు క్షేత్రాలను దర్శించుకోవడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే అందుబాటులో రైల్వే సదుపాయం మరింత సులభం కానుంది. మరో కొత్త రైలును రైల్వే శాఖ ప్రకటించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుపతి - షిర్డి మధ్య భక్తుల రాకపోకలకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త రైలును ప్రకటించడంతో భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి - సాయినగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి వారం ఈ రైలు సర్వీస్ ఉంటుంది.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

ఈ నూతన రైలు సేవను కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న వర్చువల్‌గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండో వీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ షిర్డి చేరుకుంటుంది.

Also Read: School Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసా?

ఈ మార్గమధ్యంలో ఉన్న భక్తులకు కూడా షిర్డి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరతాయని, ముఖ్యంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News