New Year Celebration: న్యూఇయర్ వేడుకలకు గోవా వెళ్తున్నారా? ఇవి తెలిస్తే సేఫ్..లేదంటే పోయాం మోసం?!

New Year Celebration 2026: న్యూఇయర్ పార్టీ కోసం కుర్రాళ్లు చాలా మంది గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు 25 నుంచి జనవరి 1 వరకు గోవాలో నైట్ లైఫ్ అదిరిపోతుందని.. అక్కడ జరిగే ఈవెంట్లలో ఎంజాయ్ చేసేందుకు ఎంతో మంది ఉత్సాహాం చూపిస్తున్నారు. అయితే ఈ పార్టీల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

Written by - Harish Darla | Last Updated : Dec 12, 2025, 05:29 PM IST
New Year Celebration: న్యూఇయర్ వేడుకలకు గోవా వెళ్తున్నారా? ఇవి తెలిస్తే సేఫ్..లేదంటే పోయాం మోసం?!

New Year Celebration 2026: న్యూఇయర్ పార్టీ కోసం కుర్రాళ్లు చాలా మంది గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు 25 నుంచి జనవరి 1 వరకు గోవాలో నైట్ లైఫ్ అదిరిపోతుందని.. అక్కడ జరిగే ఈవెంట్లలో ఎంజాయ్ చేసేందుకు ఎంతో మంది ఉత్సాహాం చూపిస్తున్నారు. అందులోనూ కొత్త ఏడాది రాబోతున్న తరుణంలో గోవాలో బీచ్‌లు కిటకిటలాడతాయి. దేశం నలుమూలలు నుంచి ప్రజలు ఇక్కడికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ పార్టీల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

Add Zee News as a Preferred Source

మీరు 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. మీ భద్రత కోసం తప్పనిసరిగా ఇవి పాటించండి.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటుగా ఉందో..
ఏదైనా క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే, ఎమర్జెన్సీ ఎగ్జిట్ (EXIT) అత్యవసరంగా బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ఎటువైపు ఉందో తెలుసుకోవాలి. మెయిన్ ఎంట్రన్స్ నుంచే కాకుండా కనీసం రెండు అత్యవసర ద్వారాలను గుర్తుపెట్టుకోండి. అగ్నిప్రమాదం, తొక్కిసలాట లేదా జనసమూహం పెరిగినప్పుడు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఇది ఎంతో కీలకంగా మారుతుంది.

Also Read: Pini Village Women: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు..భారత్‌లోనే వింతైన గ్రామం..ఎక్కడుందో తెలుసా?

లైవ్ లొకేషన్ షేర్ చేయండి..
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మీరు ఎక్కడికైనా  వెళ్లినప్పుడు మీ లైవ్ లొకేషన్‌ను మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులకు షేర్ చేయండి. మీరు అక్కడికి వెళ్లే ముందే విషయాన్ని తెలియజేయండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో త్వరగా సహాయం అందించేందుకు వీలుగా ఉంటుంది. 

తస్మాత్ జాగ్రత్త..
న్యూ ఇయర్ వేడుకల్లో మీరు వెళ్లిన ప్రతిచోటును, ప్రతి కదలికను జాగ్రత్తగా గమనించండి. మీకు ఏదైనా అనుమానాస్పదంగా  ఏవైనా బ్యాగులు లేదా వ్యక్తులు కనిపిస్తే.. సమాచారాన్ని మేనేజర్ ‌కు చేరవేసి.. ఆ ప్రాంతానికి వీలైనంత దూరంగా వెళ్లిపోండి.

మత్తు పానీయాలతో జాగ్రత్త..
పార్టీలో భాగంగా మీరు డ్యాన్స్ ఫ్లోర్‌కు వెళ్లినప్పుడు మీ డ్రింక్ ఎప్పుడూ టేబుల్‌పై వదిలి వెళ్లకూడదు. దాన్ని పూర్తిగా తాగడం లేదా మీతో పాటు తీసుకెళ్లడం చేయండి. 

అపరిచితులను నమ్మవద్దు.. 
అపరిచితులు ఇచ్చే పానీయాలను అస్సలు తీసుకోవద్దు. కొన్నిసార్లు ఈ డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపే ప్రమాదం ఉంటుంది. మీ జాగ్రత్త కోసం మీకు తెలిసిన పానీయాలు తీసుకోవడం లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే డ్రింక్స్‌ను వద్దు అని చెప్పడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీరు గోవా నైట్‌లైఫ్‌ను సురక్షితంగా ఎంజాయ్ చేయోచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Hardik Pandya Girlfriend: హార్దిక్ పాండ్యా కాబోయే భార్య ఈమెనే..టీ20 మ్యాచ్ తర్వాత ఇలా..పబ్లిక్‌గా బయటపడ్డారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News