)
Bihar CM Swearing:బీహార్ కొత్త సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. అంటే ఔననే అంటున్నాయి అంతేకాదు మంత్రివర్గంలో ఈ సారి బీజేపీకి ఎక్కువ స్థానాలు ఆశించబోతున్నట్టు తెలుస్తుంది. బిహార్ లో జరిగిన ఎన్నికల్లో బిజేపీ, జేడీయూ ఇతర ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 243 స్థానాలకు గాను 202 సీట్లను గెలిచి బిహార్ లో కనీవినీ ఎరగని విజయాన్ని సొంతం చేసుకుంది. బిజేపీ బిహార్ లో అత్యధికంగా 89 సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు జేడీయూ 85 సీట్లను కైవసం చేసుకుంది. చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి 19 సీట్లు గెలిచింది.జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్తాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి.
బీజేపీ అతిఎక్కువ సీట్లతో పై చేయి సాధించింది. బిహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు నితీష్ కుమార్ ఈ రోజు రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా తన రాజీనామా సమర్పించనున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ను అనుమతి కోరనున్నారు. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎమ్మెల్యే సంతకాలతో కూడిన లేఖను అందజేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ .. నితీష్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా గఠ్ బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. ఆర్జేడీ 25 సీట్లు గెలుచుకోగా, ప్రశాంత్ కిషోర్ పార్టీ 238 సీట్లలో పోటీ చేసి బోణి కొట్టలేక బొక్కా బోర్లా పడింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే.. ఎంఐఎం 5 స్థానాలు గెలిచింది. ఈ ఫలితాలు ప్రతిపక్ష పార్టీల విధానాలకు ఒక గుణపాఠం అని చెప్పాలి. అటు ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వి యాదవ్‌కు ఇది పెద్ద సవాలుగా మారాయి.
ఈ సారి జరగబోయే కేబినెట్ విస్తరణలో బీజేపీ ఆధిపత్యం వహించబోతుంది. కొత్త ప్రభుత్వ కేబినెట్లో బీజేపీకి 15 నుంచి 16 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. JDU కి దాదాపు 14 మంత్రి పదవులు లభించనున్నాయి. అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు JDU కి వెళ్తాయని అంచనా. LJP, మాంఝీ మరియు కుష్వాహా పార్టీలకు ఒక్కొక్కరికి మంత్రి పదవి లభించే అవకాశాలున్నట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తూన్న మాట.
ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 19 లేదా 20 తేదీలలో జరగనుంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే .. 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. నితీష్ కుమార్ బీహార్‌కు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా మరో రికార్డు ఆయన ఖాతాలో జమ అయింది. 2005 నుండి అధికారంలో ఉన్న ఆయన 2014-15లో స్వల్ప కాలంలో జితిన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పటికే కూటమిలో అటు ఇటు మార్చి మొత్తంగా తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. వాటిలో ఆరుసార్లు NDA మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి, ఆయన 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన బీహార్ లోనే మన దేశంలోనే మొదటి నాయకుడిగా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. NDA యొక్క ఈ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook