)
Nitish Kumar Bihar CM Swearing Ceremony: నితీష్ పలుమార్లు కూటములు మార్చి ఇప్పటి వరకు 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ సారి బీజేపీ మద్దతుతో పదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మన దేశంలో ఇన్ని సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులకు ఎక్కాడు. నితీష్ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, NDA అధికారంలో వున్న AP సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు హాజరుకానున్నారు. దీంతో పట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
నితీష్ కుమార్‌తో పాటు BJP, LJP కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. మంత్రివర్గ కూర్పుపై భాగస్వామ్య పక్షాల మధ్య ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు ఎన్డీఏలోని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు, జేడీయూ 85 సీట్లు రావడంతో ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి కేటాయించానే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, జేడీయూకు 14, ఎల్జేపీ పార్టీకి 3, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎంలకు ఒక్కోటి చొప్పున మంత్రిపదవులు లభించే అవకాశం ఉంది.
అంతకుముందు జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసనసభపక్ష నేతగా నీతీశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్‌లో జరిగిన కార్యక్రమంలో నీతీశ్ కుమార్‌ను శాశనసభ పక్షనేతగా విజయ్ చౌదరి, ఉమేష్ కుష్వాహా ప్రతిపాదించగా, పార్టీ నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభా పక్షనేతగా తారాపుర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 సీట్లకు గాను ఏకంగా 202 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది. కాగా మహా గఠ్బంధన్ కేవలం 35 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. ఇక ఏఐఎంఐఎం పార్టీ బిహార్‌లోని ముస్లిం మెజారీటీ స్థానాల్లో తనదైన ముద్ర వేసి 5 స్థానాల్లో గెలిచింది. బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నెలకొల్పిన జనసూరజ్ పార్టీ కనీసం బోణి కొట్టలేక చేతులెత్తేసింది. దీనితో బిహార్‌లో మరోసారి బీజేపీ, జేడీయూ సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.