Swami Nityananda: మరో వివాదంలో స్వామి నిత్యానంద..!.. పెళ్లికానీ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి సంచలన నిజాలు..?..

Swami nityananda controversy: స్వామి నిత్యానంద మరో సారి వార్తలలో నిలిచారు. గత కొన్నిరోజులుగా ఆయన సజీవ సమాధి అయ్యారని.. చనిపోయి కూడా చాలా రోజులైందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన బతికే ఉన్నారని కైలాసదేశం ప్రతినిధులు ఇటీవల వీడియోను రిలీజ్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 10:34 AM IST
  • మళ్లీ చిక్కుల్లో నిత్యానంద..
  • చర్యలకు ఉపక్రమించిన బొలివియా..?
Swami Nityananda: మరో వివాదంలో స్వామి నిత్యానంద..!.. పెళ్లికానీ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి సంచలన నిజాలు..?..

Swami nityananda kailasadesam controversy:  కాంట్రవర్సీ గురువు, తనకు తానుగా దేవుడ్ని అని ప్రకటించుకున్న నిత్యానంద మరోసారి వార్తలలో నిలిచారు. ఇప్పటి వరకు ఆయన చనిపోయారని వార్తలువచ్చాయి. దీనిపై ఏకంగా కైలాస దేశం ప్రతినిధులు రంగంలోకి స్వామి నిత్యానంద బతికే ఉన్నారని.. ఇన్ని రూమర్స్ అని కూడా కొట్టిపారేశారు. అయితే.. మరోసారి నిత్యానంద వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఆయన కొంత మంది మహిళ భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారని, నటి నందితతో రోమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు.

Add Zee News as a Preferred Source

మరోవైపు చిన్న పిల్లల అక్రమ రవాణా కేసులో సైతం.. ఆయన హస్తమున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన కర్ణాటక వదిలి పెట్టి పారిపోయారు. ఈక్వెడార్ సమీపంలో ఒక దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అని పేరుపెట్టుకున్నారు. అంతేకాకుండా.. తమదేశానికి ప్రత్యేకంగా జెండా, కరెన్సీ, వీసాలను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. స్వామి నిత్యానంద కైలాస ప్రతినిధులు కొందరు సౌత్ అమెరికి దేశమైన బొలీవియాపై కన్ను వేసినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

అక్కడి తెగతో కైలాస దేశంవారు వెళ్లి కలిసి.. తమకు కొంత భూభాగాన్ని లీజ్కు ఇవ్వాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 20 ఏళ్ల పాటు లీజ్ కు కావాలని ముందుగా మాట్లాడుకున్నారు.  ఆ తర్వాత అక్కడ కార్చీచ్చు  వల్ల అడవులు కాలిపోయాయి. అక్కడి వారికి సాయం చేసినట్లు బాగా కలరింగ్ ఇచ్చారు. అక్కడ ఒక తెగకు చెందిన నాయకుడికి డబ్బుల ఆశచూపి.. ఆ లీజ్ ను వెయ్యి ఏళ్లకు బదిలి అయ్యేలా కూడా ప్రపోజల్ ను మరల పెట్టినట్లు తెలుస్తొంది. ఇది కాస్త బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ వరకు వెళ్లింది.

Read more: Supreme Court: హెచ్‌సీయూ భూముల వివాదం.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు..రేవంత్ సర్కారుకు కీలక ఆదేశాలు..!

దీంతో ఆయన దీనిపై సీరియస్ అయ్యినట్లు సమాచారం. మొత్తంగా నిత్యానంద ప్రతినిధులు సీక్రెట్ గా చేయాలనుకున్న మోసపూరీతమైన పని వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు రంగంలోకి కైలాస దేశం ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడి యువతుల్ని కూడా పెళ్లిపేరుతో కైలాస దేశం ప్రతినిధులు లోబర్చుకొవడానికి ప్రయత్నించిట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం బొలివియా దేశం స్వామి నిత్యానందపై సీరియస్ గా చర్యలు తీసుకునేదుకు ఉపక్రమించినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News