బోసిపోయిన బీజేపీ ప్రధాన కార్యాలయం

ఢిల్లీ ఫలితాల వెల్లడి కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Last Updated : Feb 11, 2020, 11:22 AM IST
బోసిపోయిన బీజేపీ ప్రధాన కార్యాలయం

ఢిల్లీ ఫలితాల వెల్లడి కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని రకాలుగా ఢీకొడతాం. .  ఈసారి ఢిల్లీ పీఠం మాదే. .  దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్నామని ధీమాగా ఉన్న బీజేపీ..  దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం నిరాశే ఎదురవుతోంది.  చీపురు పార్టీ దెబ్బకు .. కమలం కుంగిపోతోంది.  కాషాయ పార్టీ..  కేవలం 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడమే దీనికి ఉదాహరణగా తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తొలి ఫలితం కూడా వెలువడలేదు. కానీ అంతలోనే.. బీజేపీలో నైరాశ్యం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది.

ఓవైపు ఫుల్ జోష్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి నెలకొనగా.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాత్రం సందడి కనిపించలేదు. పైగా ఎప్పుడూ  కొద్ది మందైనా కార్యకర్తలు, నాయకులతో ఉండే బీజేపీ ప్రధాన కార్యాలయం పూర్తిగా బోసిపోయింది. కార్యాలయం వద్ద ఎవరూ కనిపించకపోవడంతో .. ఢిల్లీ ఎన్నికల్లో వైఫల్యమే .. బీజేపీ నైరాశ్యానికి కారణమా అని అనిపిస్తోంది.. 

Trending News