భువనేశ్వర్: ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దాడిచేశారు. దాడిలో గాయపడిన సుదర్శన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం పూరీలో చోటు చేసుకుంది. పూరీలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్' లో పాల్గొనటానికి వచ్చిన ఆయనకు ఇలా జరగడంపై అభిమానులు బాధపడుతున్నారు. ఇసుకతో చిత్రాలు చెక్కడం ద్వారా ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే దాడికి కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.