One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదం

Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2024, 03:11 PM IST
One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదం

One Nation One Election: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తన కలను ఎన్డీయే సర్కార్‌ సాకారం చేసుకోనుంది. ఈ మేరకు జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర తెలపడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక దేశం- ఒక ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా ఆమోదం తెలపడం విశేషం.

Also Read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు

ఆమోదం పొందడంతో ఒక దేశం- ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం ఏర్పడుతోందని బీజేపీ వాదిస్తోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీని 2 సెప్టెంబర్‌ 2023న ఏర్పాటుచేశారు. 191 రోజుల కసరత్తు అనంతరం ఆ కమిటీ 18,626 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ రెండు కీలక ప్రతిపాదనలు చేసింది. జమిలి ఎన్నికలు రెండు దశల్లో చేయాలని ప్రతిపాదించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి చేయాలని ప్రతిపాదించగా.. తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేరోజు జరపాలని సూచించింది.

Also Read: Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్, సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి

 

ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో అభివృద్ధి ప్రక్రియ.. సామాజిక ఐక్యతను ప్రోత్సహించేందుకు.. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుందని కమిటీ పేర్కొంది. ఏకకాలంలో ఓటింగ్‌ నిర్వహించడంతో పారదర్శకత, సౌలభ్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, భద్రతా దళాలు కూడా ఎలా వినియోగించుకోవాలో కూడా కమిటీ సూచనలు చేసింది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యలో జరుగుతాయా? లేదా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News