Karregutta: 2014లో అధికారంలో చేపట్టిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కారు.. అటు బహిర్గత శత్రువులైన ఉగ్రవాదులతో పాటు అంతర్గత శతృవులైన తీవ్రవాద నక్సలిజం అంతం చేయడాన్ని పనిగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్లను ఏరివేసే పనిని మొదలుపెట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు 90 శాతం నక్సలైట్స్ మరణించడమే.. లొంగిపోవడం జరిగింది. ఇక ఈ నక్సలిజం పురుడుపోసుకుంది పశ్చిమ బంగాల్ లోని నక్సల్ బరి గ్రామంలో. అక్కడ ఉద్యమం పురుడు పోసుకుంది.
ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దేశ వ్యాప్తంగా నక్సలిజం పలు ప్రాంతాల్లో ప్రబలింది. ముఖ్యంగా పశ్చిమ బంగాల్ తో పాటు ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్లకు అడ్డా ఉంది. గతంలో పలు గ్రూపులుగా ఉన్న నక్సల్స్ అందరు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్‌గా ఆ తర్వాత తన పేరు మార్చుకుంది. నక్సలైట్స్ కు ప్రస్తుతం కేంద్ర బిందువుగా ఉన్నది మాత్రం చత్తీస్‌గడ్‌లోని జగదల్ పూర్‌లోని బస్తర్ ప్రాంతం. దీన్నే దండకారణ్యం అంటారు. ఇది చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉంది.
ఈ ప్రాంతాల్లోనే నక్సలైట్స్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇండియన్ మావోయిస్టులు.. ISIS, బొకోహరామ్ తర్వాత మూడో అతిపెద్ద తీవ్రవాద సంస్థ అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో మావో అంతు తేల్చేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఆపరేషన్ కొసాగుతుంది. అయితే బలగాల కూంబింగ్‌లో వారికి మావోల బంకర్ బయటపడింది. అయితే పోలీసులు తమను చుట్టుముడుతున్నారన్న సమాచారంతో మావోయిస్టులు వారి స్థావరాల నుంచి తప్పించుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









