Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌తో అర్ఱరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన మెరుపుదాడి విజయవంతమైంది. 25 నిమిషాల వ్యవధిలో 21 స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ క్రమంలో అనంతర పరిణామాల్ని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
ఆపరేషన్ సింధూర్ పరిణామాలపై చర్చించేందుకు రేపు మే 8వ తేదీ ఉదయం 1 1 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ మళ్లీ దాడికి ఎగబడితే ఏం చేయాలి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలనేదానిపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఇవాళ కేంద్ర హోంసాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలు, డీజీపీలు సమావేశంలో పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్, అనంతర పరణామాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తే ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. మే 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత 1.05 గంటల నుంచి 1.30 గంటల వరకు దాదాపు 25 నిమిషాలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిగాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Also read: Operation Sindoor: 25 నిమిషాలు...21 ఉగ్ర స్థావరాలు ఆపరేషన్ సింధూర్ సక్సెస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









