Pahalgam Attack: ఛీ..ఛీ.. ఉగ్రదాడిలో అమరుడైన లెఫ్టినెంట్ భార్యపై అలాంటి కామెంట్లు.!. నిందితుడ్ని ఏంచేశారంటే..?

Pahalgam Terror Attack: పహల్గంలో ఇటీవల నేవీ అధికారి వినయ్ నర్వాల్ ను ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై ఒక నీచుడు.. ఆయన భార్యపై నీచమైన కామెంట్లు చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2025, 02:30 PM IST
  • నేవీ అదికారి భార్యపై కాంట్రవర్సీ కామెంట్లు..
  • అరెస్ట్ చేసిన పోలీసులు..
Pahalgam Attack: ఛీ..ఛీ.. ఉగ్రదాడిలో అమరుడైన లెఫ్టినెంట్ భార్యపై అలాంటి కామెంట్లు.!. నిందితుడ్ని ఏంచేశారంటే..?

man controvery comments on navy officer vinay narwal wife: జమ్ములోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. అడవుల్లో నుంచి పహాల్గంకు వచ్చి.. ఆర్మీ దుస్తులో అక్కడున్న టూరిస్టులను పిట్టల్లా కాల్చి పైశాచీక అనందం పొందారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలనో 26 మంది ప్రాణాలు కొల్పోగా.. 20 మందికిపైగా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆర్మీఅధికారి వినయ్ నర్వాల్, హిమాన్షి కొత్త జంట ఘటన దేశాన్ని కలిచి వేసింది. ఏప్రిల్ 16న వీళ్ల పెరిజరిగింది. ఆతర్వాత 19న రిసెప్షన్  చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కు వచ్చిన ఈ జంట విగత జీవుల్లా మారిపోయారు. అయితే.. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కర్ని కలిచివేసింది.

కనీసం కాళ్ల పారణి ఆరక ముందే నవవధువు తన కళ్ల ముందే భర్తను కోల్పోయింది. దీనిపై దేశమంతట కూడా కన్నీళ్లను పెట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఒక వ్యక్తి నీచంగా మాట్లాడాడు. అసలు.. ఆమెకు ఈ పెళ్లి ఇష్టముందో లేదో.. లేదా.. ఏదైన స్కెచ్ వేసి ఉంటుందని  ఈ ఘటన ఉన్న ఫోటో కింద కామెంట్లు చేశారు.

Read more: Pahalgam Terror Attack: కొంచెమైన సిగ్గుందా..?.. డిప్యూటీ పీఎంకు ఇచ్చిపడేసిన పాక్ మాజీ క్రికెటర్ .. ఏమన్నారంటే..?

ఆమె షూటర్ ను ఏర్పాటు చేసి తన భర్తను చంపించి ఉంటుంది కాబోలు అని కామెంట్లు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.  దీంతో ఇది కాస్త పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు.. అభయ్ శ్రీ వాస్తవ్ అనేు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News