
Pahalgam Attack what is kalma: పహాల్గం ఘటనను దేశ వాప్తంగా ప్రజలు ఖండిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది ఆస్పత్రులలో ఉన్నారు. అంతే కాకుండా.. మినిస్విట్జర్లాండ్లో సరదాగా గడిపేందుకు టూరిస్టులు వెళ్లారు.
ఈ క్రమంలో ఆర్మీదుస్తుల్లోకి వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. ‘మీరు ముస్లింలా..? అయితే కల్మా చెప్పండని అడిగి వారు ముస్లింలు అవునా..? కాదా..? అని నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు కల్మా చదవాలని చెప్పి మరీ.. చదివిన వాళ్లను వదిలేసి ఇతరులను వదిలేశారు. కల్మ అంటే ఇప్పుడు చూద్దాం.
కల్మా (కలిమా లేదా షహాదా) అంటే ఏంటి..? ఇస్లాంలో దానికి ప్రాముఖ్యత ఎందుకు..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కల్మా లేదా షహాదా (Shahada) అనేది ముస్లింల విశ్వాసానికి ప్రతీక అని చెప్తుంటారు. ఇది అల్లాహ్ ఏకత్వాన్ని, ముహమ్మద్ ప్రవక్త ప్రవక్తత్వాన్ని నమ్మే ప్రకటన.. ఇస్లాంలో మొత్తం ఆరు కల్మాలు ఉంటాయి. వాటిలో ప్రతీదీ ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
మొదటి కల్మా: కల్మా తయ్యిబ్ (Kalma Tayyib) – స్వచ్ఛత అని అర్థం.
అర్థం: ‘అల్లాహ్ తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త ఆయన దూత అని చెప్తుంటారు.
రెండో కల్మా: కల్మా షహాదా (Kalma Shahada) – సాక్ష్యం.. అర్థం..
"నేను సాక్ష్య మిస్తున్నాను.. అల్లాహ్ తప్ప ఇంకా దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు. ముహమ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు, దూతగా చెప్తున్నాడు.
మూడో కల్మా: కల్మా తంఝీద్ (Kalma Tamjeed) – మహిమ చేతన.. అర్థం..
(అల్లాహ్ పవిత్రుడు, అల్లాహ్‌కు స్తుతి, అల్లాహ్ తప్ప ఏ దేవుడు లేడు, అల్లాహ్ గొప్పవాడు. శక్తి, బలం అల్లాహ్‌తో తప్ప మరెవ్వరి తోనూ లేదు.
నాలుగో కల్మా: కల్మా తౌహీద్ (Kalma Tawheed) – ఏకత్వం..
అల్లాహ్ తప్ప మరెవరూ పూజార్హుడు కాదు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు. రాజ్యం ఆయనదే, స్తుతి ఆయనదే. ఆయన ప్రాణం ఇస్తాడు,
ఐదో కల్మా: కల్మా అస్తఘ్ఫార్ (Kalma Astaghfar) – పశ్చాత్తాపం..
అర్థం: ప్రభువా..! నేను తెలిసీ తెలియక చేసిన, రహస్యంగా లేదా బహిరంగంగా చేసిన అన్ని పాపాలను మన్నించు. నాకు తెలిసిన పాపాలు గానీ తెలియనివి గానీ మన్నించు.
ఆరో కల్మా: కల్మా రద్దే కుఫ్ర్ (Kalma Radde Kufr) – అవిశ్వాసాన్ని తిరస్కరించడం..
అర్థం: నేను అల్లాహ్ తప్ప దేవుడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు భాగస్వామి లేరని నమ్ముతున్నాను.. నేను బహు దేవారాధన, కుఫ్ర్, అసత్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నాను. నీవే ఒకే నిజమైన దేవుడు, నీవే నా దైవం.
కల్మాలు ముస్లిం జీవితంలో విశ్వాసాన్ని మెరుగు పరచేందుకు, ఆత్మ శుద్ధికి, అల్లాహ్‌తో అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. కల్మాలు అల్లాహ్ ఏకత్వాన్ని, ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తత్వాన్ని, అవిశ్వాసాన్ని తిరస్కరించడాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి.
ఈ కల్మాలను జపించడం ద్వారా ముస్లింలు అల్లాహ్‌తో తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. అలాగే, ఇస్లాం సిద్ధాంతాల పట్ల తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తారు. అంతేకాక, ఈ కల్మాలు పాపాలను మన్నించమని ప్రార్థనలు, కృతజ్ఞత భావన, బహు దేవాతారాధన నుంచి రక్షణ కోసం చేసిన ప్రార్థనలుగా కూడా పరిగణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe