Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం కీలకనిర్ణయం..48 టూరిస్టు ప్రాంతాల మూసివేత..

Pahalgam Terror Attack: కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో 48 టూరిస్టు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. పటిష్టమైన భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్‌ చేస్తామని చెప్పిది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 09:03 AM IST
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం కీలకనిర్ణయం..48 టూరిస్టు ప్రాంతాల మూసివేత..

Pahalgam Terror Attack: పహాల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మంగళవారం జరిగిన ఈ ఉగ్రదాడిలో 27 మందు టూరిస్టులు మృతి చెందారు. ప్రధానంగా మతం గురించి ఆరా తీసి హిందూ అని చెప్పగానే వాళ్లను గన్‌తో ఉగ్రవాదులు పేల్చివేశారు. పాకిస్తాన్ చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ ఘాతాకానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎల్ఓసి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు ఇప్పటికే సింధు జలాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన పలువురు మంత్రులు, నేతలు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారు. అణ్వాయుధాలు ప్రయోగించాల్సి ఉంటుంది, సింధు నది జలాల్లో నీరు పారకుంటే వారి రక్తం పారుతుందని భారత్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు. కీలక ఆధారాలు కూడా ఇప్పటికే ఎన్‌ఏఏ చేతిలో ఉంది. ఓ ఫోటోగ్రాఫర్ దాడి సమయంలో చెట్టుపైకి ఎక్కి వీడియోని తీశారు. అది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే పహల్గాం టూర్‌కు వచ్చిన కొంత మందిపై టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ముందస్తుగా రెక్కీ వేసి మతం ఆరా తీసి వారని గన్‌తో షూట్ చేసి చంపేశారు.

 ప్రధానంగా మగవాళ్లను లక్ష్యంగా చేసుకొని హిందూ అనగానే చంపేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలోని 48 టూరిస్టు ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. మొత్తంగా 87 పర్యాటక ప్రాంతాలు ఉండగా అందులో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను ప్రస్తుతం టూరిస్టులకు అనుమతించడం లేదు. 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మరోవైపు హిందూ జలాల నిలిపివేత కారణంగా పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు భారత్ సింధుజలాలను నిలిపివేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమై ఎటు పాలు పోనీ దుస్థితిలో ఉంది. ఇక ప్రధాని షహబాజ్‌ షరీఫ్ దేశంలోని నీటి నిర్వహణ సదుపాయాల కోసం కమిటీ ఏర్పాటు చేసి అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. పరిష్కారంతోపాటు దీర్ఘకాలిక వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు మార్గాలను ఈ కమిటీ ప్రతిపాదించింది.

ఇదిలా ఉండగా ఎల్ఓసి వద్ద పాక్‌ గడిచిన నాలుగు రోజుల నుంచి కాల్పులు జరుపుతూనే ఉంది. సరిహద్దుల వెంట పాకిస్తాన్ ఆర్మీ వక్ర బుద్ధి చూపుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బారముళ్ల జిల్లాలోని అక్నూర్ సెక్టార్ లో ఆ దేశం కాల్పులకు తెగబడినట్లు సమాచారం. వీటిని సమర్థవంతంగా భారత సైన్యం కూడా తిప్పి కొడుతోందని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం రోజు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

READ ALSO:  Bank Holiday: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?  

READ ALSO: నేటి రాశిఫలాలు.. ఇబ్బందులు పడే రాశులు ఇవే, సక్సెస్‌ పొందబోతున్న ఏకైక రాశి ఇదే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News