Pahalgam Attack: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్‌ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..

Pahalgam Attack: నిన్న జరిగిన ఉగ్రదాడి భారత్ ఎప్పటికీ మర్చిపోలేనిది. టూరిస్టులపై ఒక్కసారిగా విరుచుటపడడంతో 30 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎయిర్ లైన్ కంపెనీ ప్రయాణీకులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 23, 2025, 10:48 AM IST
Pahalgam Attack: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్‌ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..

 Pahalgam Attack: టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ కంపెనీ శ్రీనగర్ కి వెళ్తున్న ప్రయాణికులకు క్యాన్సిలేషన్ లేదా రీషెడ్యూల్ చార్జీలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు ఈరోజు నుంచి వర్తిస్తుందని చెప్పింది. అంతేకాదు అదనంగా రెండు ఫ్లైట్లను శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి నడుపుతున్నామని చెప్పింది.ఈ మేరకు ఎక్స్ వేదికగా టాటా తెలిపింది. 

Add Zee News as a Preferred Source

ఎయిర్ ఇండియా కూడా ఇప్పటికే రెండు అదనంగా ఫ్లైట్లను శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ముంబైకి అందిస్తోంది. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఫ్లైట్ రూట్స్‌ ఈ మార్గంలో యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. క్యాన్సలేషన్ చార్జీలను తొలగించుకున్నట్లు ఎయిర్‌ ఇండియా కూడా తెలిపింది. ఈనెల చివరి వరకు ఇది వర్తిస్తుంది అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే ప్రయాణికులు 0116932933 కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చన్నారు 

అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కూడా కేన్సలేషన్‌ ఛార్జీలను తొలగించేసింది. ఏప్రిల్ 31 వరకు వర్తిస్తుందని ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్‌సైట్లో బుక్ చేసుకోవచ్చని ఎలాంటి చార్జీలు లేకుండానే వాళ్ళు ప్రయాణికులు క్యాన్సల్ చేసుకోవచ్చు. లేదా ప్రయాణ తేదీలను కూడా మార్చుకోవచ్చు అని తెలిపారు. దీనికి వాట్సాప్ నంబర్ 91 6360012345 కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

 లష్కర్ ఏ తోయబాకు చెందిన ఈ సంస్థ ఒక్కసారిగా నిన్న పహల్గాంలో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో 30 మంది వరకు చనిపోయారు. అంతేకాదు చాలా మంది గాయపడ్డారు. ఒక్కసారిగా టూరిస్టులపై విరుచుకుపడటంతో భయాందోళన గురై చాలా మంది కాశ్మీర్ వెళ్ళిన టూరిస్టులు ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై భిన్నంగా స్పందిస్తున్నాను. అంతే కాదు విషయం తెలిసిన వెంటనే అమిత్ షా కూడా సంఘటన ప్రదేశానికి వెళ్లారు. ఇక మోదీ అత్యున్నత స్థాయిలో ఈరోజు భేటీ కానున్నారు‌.

ఇదీ చదవండి: ఎండిపోయిన నిమ్మకాయలను పారేయకండి.. ఈ 5 స్మార్ట్ ట్రిక్స్‌తో మళ్లీ వాడొచ్చు ..

ఇదీ చదవండి: భయం.. బాధ.. పేరెంట్స్‌ను కోల్పోయి గుక్కపెట్టి ఏడ్చిన పిల్లల వీడియో వైరల్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News