Amit Shah: పహల్గం ఘటన.. అన్నిరాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్.. హైదరాబాద్ లో ఎన్ని పాక్ కుటుంబాలు ఉన్నాయంటే..?

Amit Shah Dial All Cms: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ముఖ్యంగా మనదేశంలో ఉన్న పాక్ వాళ్లను ఇప్పటికే 48 గంటల్లో వెళ్లిపోవాలని భారత్ అల్టిమేటం జారీ చేసినం విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా కాల్ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2025, 04:10 PM IST
  • పహల్గం ఘటన..
  • రేవంత్ కు అమిత్ షా ఫోన్ కాల్..
Amit Shah: పహల్గం ఘటన..  అన్నిరాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్.. హైదరాబాద్ లో ఎన్ని పాక్ కుటుంబాలు ఉన్నాయంటే..?

Pahalgam Terror Attack amit shah calls all states cms: పహల్గం ఘటనపై ఇప్పటికే భారత్ పాక్ కు చుక్కలు చూపిస్తుంది. ఇదిలా ఉండగా.. పాక్ తో సింధుజలాల ఒప్పందం రద్దు చేసుకుంది. అదే విధంగా వీసాలను రద్దు చేసింది. అటారీ మార్గాన్ని క్లోజ్ చేసింది. అంతే కాకుండా.. దౌత్యవేత్తల సంఖ్యను కుదించింది. ఈ క్రమంలో భారత్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి వెంటనే పంపించివేయాలని ఏకంగా కేంద్ర హోమంత్రి అమిత్ షా..అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మరీ చెప్పారు.ఈ క్రమంలో దీన్ని బట్టి చూస్తే భారత్ ఎంత సీరియస్ గా ఉందో ఈ అంశంపై స్పష్టంగా తెలుస్తొంది.

Add Zee News as a Preferred Source

మరోవైపు పాక్ , భారత్ ల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం సిమ్లాను పాక్ రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఈరోజు భారత్ , పాక్ ల మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి.

అయితే.. దేశంలోని అన్నిరాష్టాల్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. గతంలో సార్క్ వీసా పథకం కింద వచ్చిన వాళ్లు.. 48 గంటల్లో.. అదే విధంగా, మెడికల్ వీసాల మీద వచ్చిన వాళ్లు.. ఏ నెల 29 వరకు దేశం వదిలిపెట్టి వెళ్లిపొవాలని కేంద్రం ఆదేశించింది.ఈ మేరకు అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి దీనికి అనుగుణం చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

మరోవైపు ముఖ్యంగా హైదరబాద్ లో ప్రస్తుతం 208 వరకు పాక్ కుటుంబాలు ఉన్నాయని  సమాచారం .ఈ క్రమంలో వీరంతా వివిధ వీసాలతో హైదరాబాద్లోకి ప్రవేశించి ఇక్కడ ఉంటున్నారు. వెంటనే వీళ్లను వెనక్కు పంపించాలని కూడా అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Read more: Pahalgam Terror Attack: కొంచెమైన సిగ్గుందా..?.. డిప్యూటీ పీఎంకు ఇచ్చిపడేసిన పాక్ మాజీ క్రికెటర్ .. ఏమన్నారంటే..?  

ఇక మరోవైపు ఉగ్రచర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నేతలు ఖండించారు.  ఉగ్రచర్యలకు వ్యతిరేకంగా కేంద్రం.. ఏంచేసిన కూడా తమ సపోర్ట్ ఉంటుందన్నారు. ఉగ్రచర్యలను ఖండిస్తు.. పిరికి పందచర్యగా అభివర్ణించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News