Amitshah and Jaishankar meets with Droupadi Murmu: అనంత్ నాగ్ జిల్లాలోని పహాల్గంలో ముష్కరులు టూరిస్టులపై దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. మరో 20 మందికి పైగా ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
అయితే.. ముష్కరుల దాడి ఘటనను మోదీ సర్కారు సీరియస్ గా తీసుకుంది.ఈ క్రమంలో ఇప్పటికే పాక్ ను అష్టదిగ్బందనం చేసింది. అంతే కాకుండా.. పాక్ తో తాడో పేడో తెల్చుకునేందుకు రెడీ అయిపోయింది.
ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పాక్ మిసైళ్ల ప్రయోగంను నిర్వహించడం కూడా ప్రస్తుతంటెన్షన్ కు గురిచేసే అంశంగా మారింది. ఈ ఘటనతో దేశంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పాక్ కూడా భారత చర్యల్ని కాపీ కొట్టింది. భారత్ పౌరుల వీసాలను రద్దు చేసింది. గగన తలలా మార్గాన్నినిలిపివేసింది. అదే విధంగా పాక్..త్రివిధ దళాల అధిపతులు, పలువురు మంత్రులతో సమావేశమైంది. సింధు జలాల ఒప్పందంను భారత్ రద్దు చేసుకొవడంపై పాక్ మేకపోతు గాంభీర్యంను చూపిస్తుంది.
Read more: Prakash Raj On Pahalgam: కశ్మీర్ ఆటస్థలం కాదు..!.. ఉగ్రదాడిపై సంచలనంగా మారిన ప్రకాష్ రాజ్ పోస్ట్..!
దీనిపై ఎంతదూరమైన వెళ్తామంటూ ప్రగల్బాలు పకులుతుంది. పాక్ కు వచ్చే నీటిని మళ్లించడమే యుద్ద చర్యగా పరిగణిస్తామని పాక్ చెప్పుకొచ్చింది. ఈ చర్యల్ని తిప్పికొడతామని పాక్.. ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలికింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









