Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ ఎటాక్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆ ఉగ్రవాది తల కావాలి..

Pahalgam Terror Attack: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలు క్యాండీల్ ర్యాలీలకు పిలుపునిచ్చాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 24, 2025, 09:57 AM IST
Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ ఎటాక్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆ ఉగ్రవాది తల కావాలి..

Pahalgam Terror Attack: భారత స్విట్జర్లాండ్ అయిన పహల్గామ్  లో అమాయక భారతీయులపై   ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసి చంపిన ఘటనపై  దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన  వారి మృత దేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో నేవీ  లెఫ్టినెంట్‌  ఆఫీసర్‌ వినయ్‌ నర్వాల్‌ మృత దేహం ఇంటికి చేరుకుంది.

Add Zee News as a Preferred Source

ఆయన పార్ధివ దేహానికి   హరియాణా సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ నివాళులు అర్పించారు.  వినయ్‌ కుటుంబ సభ్యలను ఓదార్చారు. అదే సమయంలో వినయ్‌ నర్వాల్‌  సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. కాల్పుల తరువాత గంటన్నర  పాటు తమ  సోదరుడు బతికే ఉన్నాడన్నారు. కానీ ఆ సమయంలో ఎలాంటి సాయం అందలేదని వాపోయారు.

ఎవరైనా సాయం అందిస్తే బతికే వుండేవాడని వాపోయారు. తన సోదరుడు ముస్లీం కాదని తెలిసి 3 సార్లు కాల్చారని చెప్పారు.  అతడిని చంపిన ఉగ్రవాది తల కావాలని, వినయ్‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తో పాటు ఏపీలో జనసేన కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అటు హైదరాబాద్ ముస్లిమ్ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తన పార్టీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News