Pahalgam Attack: పహల్గం దాడి.. పాక్‌ను మట్టి కరిపించడానికి భారత్ ముందున్న ప్రధాన ఆప్షన్లు ఏంటంటే..?..

Pahalgam terror Attack: టెర్రరిస్టుల దాడి ఘటనను భారత్  చాలా సీరియస్గా తీసుకుంది.ఈ సారి మాత్రం పాక్ కు కొట్టె దెబ్బతో దాని జీవితంలో నిద్రలో కూడా భారత్ పేరు తల్చుకుంటే.. భయపడేలా ఉండాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాక్ పై తప్పనిసరిగా బుద్ది చెప్పాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 25, 2025, 06:38 PM IST
  • ఉగ్రమూకలపై భారత్ సీరియస్..
  • కఠినచర్యలకు ఉపక్రమించిన అధికారులు..
Pahalgam Attack: పహల్గం దాడి.. పాక్‌ను మట్టి కరిపించడానికి భారత్ ముందున్న ప్రధాన ఆప్షన్లు ఏంటంటే..?..

Pahalgam Terror Attack India vs Pakistan: జమ్ములోని పహల్గం కొండల్లో ఇటీవల టూరిస్టులపై జరిగిన ఉగ్ర ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ మారణకాండలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ప్రధాని మోదీ ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే కేబినెట్, హైపవర్ అధికారులతో భేటీ నిర్వహించారు. మరోవైపు అమిత్ షా, జైశంకర్ లు కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కలిశారు.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. నరేంద్రమోదీ నివాసంలో మీటింగ్ తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు పాక్ కు చుక్కలు చూపించేలా ఉన్నాయి. ఇప్పటికే సింధుజలాల ఒప్పందం, పాక్ వీసాల రద్దు,  అటారీ బార్డర్ నిలిపివేత వంటి మొదలైన నిర్ణయాలు పాకిస్తాన్ ను అష్టదిగ్బందనం చేశాయి. మరోవైపు సరిహద్దుల్లో భారత్ అదనపు బలగాల్ని మోహరించింది.  ఈ నేపథ్యంలో పాక్ సిమ్లా ఒప్పందంను రద్దు చేసుకుంది.

 ప్రస్తుతం భారత్ .. పాక్ కు గట్టిగా గుణపాఠం చెప్పాలని బలమైన దెబ్బకొట్టాలని యావత్ దేశం కోరుకుటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ ముందు ఉన్న కొన్ని అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. భారత్ పాక్ పై..   ఫైటర్ జెట్లు, రఫేల్, మిరాజ్ 2000 లను ఉపయోగించి.. పాక్ సైనిక కార్యలయాలు, ముఖ్యమైన ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తే పాక్ ను ఉక్కిరి బిక్కరిచేయోచ్చు.అంతేకాకుండా.. సిమ్లా ఒప్పందంఎలాగైన రద్దు చేశారు.. కాబట్టి శత్రుమూకల్ని బార్డర్ దాడి వేసేయోచ్చని కూడా చర్చ జరుగుతుంది.

Read more: Samantha: చిక్కుల్లో సమంత.. పాకిస్థాన్‌కు సపోర్ట్‌గా ఇన్‌స్టా పోస్ట్..?.. నెట్టింట దుమారం..  

మరోవైపు..  శతఘ్నులు, స్నైపర్ గన్స్ తో పాక్ ఉగ్రమూకలకు దెబ్బకు దెబ్బ కొట్టి మనం ఏంటోచూపించాలని కూడా కోరుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఎప్పుడు ఏమౌతుందో అన్న టెన్షన్ మాత్రం అందరిలో నెలకొంది. అయితే.. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నిపహల్గం ఉగ్రదాడుల్ని ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో భారత్ కు అండగా ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News