)
modi govt writes to bbc over its coverage on pahalgam: జమ్ముకశ్మీర్ లోని పహల్గంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిన భారత్ తీవ్రంగా పరిగణించింది. అంతేకాకుండా.. భారత్ పాక్ ను అన్ని విధాలుగా ముప్పుతిప్పలు పెడుతుంది. ఏప్రిల్ 22న పహల్గంలో సరదాగా గడిపేందుకు వచ్చిన టూరిస్టులపై ఆర్మీ దుస్తులో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణకాండను చేశారు. కేవలం హిందువుల్ని టార్గెట్ చేసుకుని ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ దుర్ఘటనలో అమాయకమైన టూరిస్టులు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఈ ఘటనపై ప్రతీకారంతో రగిలిపోతుంది.
ఇప్పటికే పలు దేశాలు సైతం ఉగ్రచర్యకు వ్యతిరేకంగా భారత్ కు తమ సపోర్ట్ తెలియజేశాయి. కానీ పాక్ మాత్రం ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ లో ఉన్న పాక్ పౌరుల్ని వాళ్ల స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతే కాకుండా.. బార్డర్ లో కాల్పులు జరుపుతున్న పాక్ వాళ్లకు .. భారత్ ఆర్మీ ధీటుగా కౌంటర్ ఇస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత దేశం ఈ ఉగ్ర ఘటనపై మాత్రం చాలా సీరియస్ గా ఉంది.
అయితే.. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పహల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని.. మిలిటెంట్ల దాడిగా ప్రచురించింది. దీనిపై భారత్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనను అమెరికా విదేశాంగ దృష్టి కి తీసుకెళ్లింది. దీంతో అమెరికా విదేశాంగశాఖ దీన్ని ఖండించింది. ఇక తాజాగా.. బీబీసీ కూడా అచ్చం ఇదే విధంగా పహల్గం ఉగ్రకుట్రను.. మిలిటెంట్ ల దాడిగా చెబుతు ఒక కథనంను ప్రచురించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నిరసనలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలో.. కేంద్ర విదేశాంగ శాఖ చాలా సీరియస్ అయ్యింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని భారత్ విదేశాంగ శాఖ.. బీబీసీ అధిపతి జాకీ మార్టీన్ కు లేఖను పంపింది. దీంతో ఈ ఉగ్రచర్యపై భారత్ ఎంత సీరియస్ గా ఉందో క్లియర్ గా అర్థమౌతుంది. మరోవైపు పాక్ కు వ్యతిరేకంగా భారత్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటు ముప్పుతిప్పులు పెడుతుంది. పాక్ మాత్రం లోన భయపడిపోతునే.. పైకి మాత్రం.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe