
Pahalgam Terror Attack navy officer wife salutes emotional video: జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహాల్గంలో ఇటీవల ఉగ్రవాదులు టూరిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అడవుల నుంచి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు. హిందువులే టార్గెట్ గా ఈ దమన కాండ సాగింది. అయితే.. ఈ ఘటనలో 30 మంది వరకు టూరిస్టులు చనిపోగా.. మరో 20 మంది వరకు ఆస్పత్రులలో అడ్మిట్ అయ్యారు.
ఈ క్రమంలో ప్రస్తుతం.. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మొత్తంగా ఈ ఘటనపై మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు... త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్ కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి కొన్నిరోజుల క్రితమే..ఏప్రిల్ 16న పెళ్లి జరిగింది.
#WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attack
The couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ
— ANI (@ANI) April 23, 2025
ఆ తర్వాత ఏప్రిల్ 19న విందు కార్యక్రమంను నిర్వహించారు. అంతే కాకుండా.. విందు అనంతరం జమ్ములోని పహాల్గంకు వెళ్లారు. అయితే.. అక్కడ సరదాగా తమ హనీమూన్ ను గడుపుతున్న ఈ జంటపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. తన కళ్ల మందే భర్త విగత జీవిగా మారడంతో నవ వధువు షాక్ కు గురైంది. కాల్పుల అనంతరం కేంద్ర బలగాలు కాల్పులలో చనిపోయిన వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు .
అంతేకాకుండా.. ఈఘటనలో ప్రస్తతం నేవీ అధికారిపై పార్థీవ దేహంను ఆయన స్వస్థలంకు తరలించారు. అంతేకాకుండా.. వినయ్ కుమార్ పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించారు. అధికారులు పెద్ద ఎత్తున చేరుకుని శ్రధ్దాంజలి ఘటించారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన భర్త పార్థీవ దేహంపై నవవధువు పడి మరీ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు పెళ్లయి.. కనీసం.. కాళ్లపారణి ఆరక ముందే నవవధువు చనిపోవడం ప్రస్తుతం అందర్ని కలిచివేసింది.
ఆమె తన భర్త పార్థీవ దేహాంపై పడి.. గుండెలు పగిలేలా రోదిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై దేశమంతట కూడా ఎమోషనల్ కు గురౌతున్నారు. ఈ నవ వధువును కన్నీళ్లను ఏవిధంగా తుడుస్తారని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆమెను ఈ బాధను మిగిల్చిన వాళ్ల మీద బలగాలు అంతకంత పగ తీర్చుకొవాలని నెటిజన్లు ఆవేశంలో రగిలిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి