Pahalgam Terror Attack: వద్దు బ్రో.. భారత్‌తో అస్సలు పెట్టుకొవద్దు.!.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచన..

Former Pak PM Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. భారత్ తో అస్సలు గొడవలు పెట్టుకొవద్దని మాజీ ప్రధాని షెహబాజ్ తో చెప్పారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2025, 04:07 PM IST
  • పహల్గం ఘటనపై పాక్ మాజీ ప్రధాని వ్యాఖ్యలు..
  • గొడవలు పెట్టుకొవద్దని సలహా..
Pahalgam Terror Attack: వద్దు బ్రో.. భారత్‌తో అస్సలు పెట్టుకొవద్దు.!.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచన..

Nawaz Sharif advices brother shehbaz on pahalgam attack: జమ్ముకశ్మీర్ లోని పహల్గంలోని ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే పాక్ ను అన్నిరకలుగా కార్నర్ చేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది.ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ సింధు జలాల ఒప్పందంను రద్దు చేసి చుక్కలు చూపించింది. అంతే కాకుండా.. వీసాలను సైతం రద్దు చేసింది. పాక్ కు చెందిన అన్ని యూట్యూబ్ ఛానెళ్లను కూడా రద్దు చేసింది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ పాక్ మీద దుందుడుకుగా ముందుకు వెళ్తుంది.  ఈ నేపథ్యంలో పాక్ ఒకవైపున కవ్వింపు చర్యలకు పాల్పడుతునే మరోవైపు భారత్ తో న్యూట్రల్ అధికారులతో ఘటనపై విచారణకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఇటీవల పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ 130 అణు బాంబులు పాక్ కోసం రెడీగా ఉన్నాయని అన్నారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్.. హనీఫ్ అబ్బాసీ కూడా జమ్ము కశ్మీర్లో హిందువుల్ని, ముస్లింలను వేర్వేరుగా చూస్తున్నారన్నారు.

మరోవైపు విదేశాంగ మంత్రి.. భిలావల్ భుట్టో.. సింధునదిని ఆపితే.. దానిలో పారేది భారతీయుల రక్తంఅని రెచ్చగొట్టాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ..రెండు అణ్వయుధాల సామర్థం ఉన్న దేశాలు తలపడటం సరికాదని నవాజ్ షరీఫ్ , పాక్ ప్రధాని షెహబాజ్ కు హితవుపలికారు.

Read more: Snake Bite Video: పాము ఎంత కసితీరా కాటు వేస్తుందో తెలుసా..?.. షాకింగ్ వీడియో మీ కోసం..

ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను..సామారస్యపూర్వకంగా, మాట్లాడి పరిష్కరించుకొవాలని మాజీ ప్రధాని పాక్ సర్కారును కోరారు. ఒకవైపు పాక్ ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఈ క్రమంలో.. మాజీ ప్రధాని నవాజ్  షరీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News