Pahalgam Terror Attack: బార్డర్‌లో మళ్లీ కాల్పులు.. భారత్‌ను అదేపనిగా రెచ్చగొడుతున్న పాక్..

Jammu Kashmir: పాక్ అదే పనిగా భారత్ ను రెచ్చగొట్టేపనులు చేస్తుంది. ఇప్పటికే గత కొన్నిరోజులుగా పాక్ బార్డర్ వద్ద సీజ్ ఫైర్ నిబంధనల్ని అతిక్రమించి కాల్పులు జరుపుతుంది.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2025, 08:22 AM IST
  • మళ్లీ కాల్పుల ఒప్పందంను వయోలెట్ చేసిన పాక్..
  • బుద్ది చెప్పిన ఇండియా..
Pahalgam Terror Attack: బార్డర్‌లో మళ్లీ కాల్పులు.. భారత్‌ను అదేపనిగా  రెచ్చగొడుతున్న పాక్..

Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రచర్యను యావత్ భారతవణి ఖండించింది. దీనిపై కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా పాక్ ను అష్టదిగ్బంధనంచేస్తుంది. ఇదిలా ఉండగా.. పాక్ మాత్రం తన వంకర బుద్దిని మార్చుకొవడం లేదు. ఇప్పటికే భారత్ సింధు జలలా ఒప్పందం, వీసాలను తిరస్కరించింది. పాక్ దేశీయులను వెళ్లిపోవాలని ఆదేశించింది.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. పాక్ ఆర్మీ.. కొన్నిరోజులుగా భారత్ ను రెచ్చగొట్టేపనులు చేస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి తాజాగా.. కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత్ లోని సైనికులు టార్గెట్ గా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా.. పాక్ కుప్వారా, పూంఛ్ జిల్లాల బార్డర్ లో కాల్పులకు తెగబడింది. అంతే కాకుండా.. దీంతో భారత్ కూడా పాక్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  ప్రస్తుతం వరుసగా నాలుగో రోజు పాక్ కాల్పులకు తెగబడింది.

మొత్తంగా పూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందంను  ఉల్లంఘించడం తొలిసారి అని భారత్ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏప్రిల్ 22న జరిగిన పహల్గం ఉగ్రఘటనను యావత్ దేశం తీవ్రంగా పరిగణించింది. ఆర్మీదుస్తుల్లో వచ్చి అమాయకులపై టూరిస్టులపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు.

Read more:Seema Haidar: భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..

ఈ ఘటనలోన 25 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. హిందువులే టార్గెట్ గా చేసుకుని ఈ కాల్పులు జరిగాయి. అయితే.. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయేల్, ఫ్రాన్స్ భారత్ కు ఉగ్రవాదంకు వ్యతిరేకంగా సంఘీ భావం తెలిపారు. మరోవైపు డ్రాగన్ కంట్రీ మాత్రం మళ్లీ పాక్ కు తమ సపోర్ట్ ఉంటుందని చెప్పడం ప్రస్తుతం ఒకింత ఆందోళన చెందించేదిగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News