Pahalgam Terror Attack: భారత్ గర్జనకు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని..?.. వైరల్ గా మారిన లెటర్..

Pahalgam Terror Attack news: పాక్ ప్రధాని షెహబాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని.. ఆయన భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని తెగ టెన్షన్ పడిపోయారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో దీనిపై భారత్ నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2025, 12:20 PM IST
  • ఆస్పత్రిలో పాక్ ప్రధాని..
  • ఇండియాతో పెట్టుకుంటే అట్లుంటదీ అంటున్న నెటిజన్లు..
Pahalgam Terror Attack: భారత్ గర్జనకు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని..?.. వైరల్ గా మారిన లెటర్..

Pak pm Shehbaz Sharif admitted in Hospital: పహల్గం ఉగ్రదాడికి భారత్  ఎక్కడ కూడా తగ్గుకుండా పాక్ కు గట్టి కౌంటర్ ఇస్తుంది.  ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందంను రద్దు చేసింది. పాక్ వీసాలను రద్దు చేసి వారి దేశప్రజల్ని తిప్పి పంపింది. అటారీ బార్డర్ ను మూసివేసింది. ఇప్పటికే 16 యూట్యూబ్ ఛానెళ్లను మన దగ్గర బ్యాన్ చేసింది. పాక్ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కు అనుమతించలేదు.

Add Zee News as a Preferred Source

ఒక వైపు పాక్ కు చుక్కలు చూపిస్తునే, మరోవైపు ప్రపంచ దేశాల ముందు కూడా పాక్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా పాక్ ఉగ్రచర్యల్ని మాత్రం గట్టిగానే తిప్పికొడుతుంది. ఇక పాక్ లోపలి గజ్జని వణికిపోతునే ఉన్నా.. పైకి మాత్రం పాక్ మంత్రులు, నేతలు.. ఇంకా అగ్గిని రాజేసే మాటలు మాట్లాడుతున్నారు. లోపల భయపడుతు..పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే బార్డర్ లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. మరోవైపు పాక్ ఇటీవల సిమ్లా కాల్పుల విరమణ ఒప్పందను ఉల్లింఘించి.. భారత్ పై  కాల్పులు జరుపుతు కవ్వింపుచర్యలు పాల్పడుతుంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ చర్యలకు భయపడి ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతేకాకుండా.. దీనికి  సంబంధించిన ఒక లెటర్ కూడా వెలుగులోకి వచ్చింది.

Read more: Siddaramaiah Video: అందరూ చూస్తుండగానే ASP చెంప పగలగొట్టేందుకు చేయెత్తిన సీఎం వీడియో వైరల్‌..

అయితే.. దీన్ని అక్కడి అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారని వార్తలు వస్తున్నాయి. పాక్ ప్రధాని మూలశంకతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారంట. అదే విధంగా ఆయన బీపీ, షుగర్ లెవల్స్ మాత్రం అబ్ నార్మల్ గా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.ఈ వైరల్ వార్తలలో నిజం ఎంత ఉందో తెలీదు... కానీ ఈ లెటర్ మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు నెటిజన్లు భారత్ గర్జనకు.. పాక్ ప్రధాని బెడ్ ఎక్కాడ్రా.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News