Pahalgam Terror Attack: జమ్ము కాశ్మీర్ ఉగ్రవాద దాడి ఒక నీచమైన చర్య అని ఫైర్ అయ్యారు ఎంపీ డీకే అరుణ.టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంతో దూరంలో లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ మరియు వక్ఫ్ సవరణ చట్టంపై మేధావుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.
370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యటక కేంద్రంగా మారిందని.. ఎంతోమంది పర్యటకులు వస్తుండడంతో అది చూసి ఓర్వలేని పాకిస్తాన్.. ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్నారు. అమాయక పర్యటకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
కశ్శీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మ శాంతికి కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. BSR సెంటర్ కు చేరుకుని మానవ హారం నిర్వహించారు.
పహల్గాంలో ఉగ్ర దాడి దేశ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి దాడులతో భారతీయ స్పూర్తిని చెదరగొట్టలేరన్నారు. ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ఉగ్రవాదానికి కుల మతాలతో పనిలేదన్నారు. కశ్మీర్ లో ప్రశాంతంత నెలకొందని ప్రజలు భావిస్తున్న సమయంలో అనేక మంది అమాయక పౌరులను కాల్చి చంపడం దారుయమన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా సౌకర్యాలను మరింత మెరుగుపరచడం ద్వారా రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









