India bas pak 16 youtube channels: జమ్ము కశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సారి మాత్రం గట్టిగా దెబ్బకొట్టేందుకు భారత్ అన్నివిధాలుగా చర్యల్ని వేగవంతం చేస్తుంది . ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ ను తాగేందుకు నీళ్లు, పంటపొలాలకు నీళ్లులేక ఉక్కిరిబిక్కిరి చేసింది. మరొవైపు భారత్ లో ఉన్న పాక్ వాళ్లు.. వెళ్లిపొవాలని డెడ్ లైన్ సైతం విధించింది.
ఈ క్రమంలో పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తునే.. కవ్వింపు చర్యల్ని మాత్రం ఆపడంలేదు. మరోవైపు పాక్ ప్రదానితో సహా ఆదేశానికి చెందని కొంత మంది నేతలు ఇటీవల చాలా వివాదాస్పదంగా మాట్లాడారు. అసలే.. భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ నేతలు చేసి వ్యాఖ్యలు అగ్నికి.. ఆజ్యంపోసేవిలా మారాయి. అయితే.. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. వరుసగా నాలుగోరోజు కాల్పులకు తెగబడింది.
ఇదిలా ఉండగా.. పాక్ కు చెందిన అన్ని యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తు భారత్ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో.. భారత్.. పాక్ మాజీ క్రికెటర్ కు చెందిన ఆయా 16 ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
Read more: Pahalgam Terror Attack: బార్డర్ లో మళ్లీ కాల్పులు.. భారత్‌ను అదేపనిగా రెచ్చగొడుతున్న పాక్..
ఏప్రిల్ 22న జరిగిన పహాల్గం ఘటనపై భారత్ తాడో పేడో తెల్చుకునే విధంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్, పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది. బార్డర్ లో భారత్ భారీగా బలగాలను మోహరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









