Seema Haidar: భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..

Pahalgam terror Attack: పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో  భారత్లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా  పాక్ నుంచి పబ్ జీ ఆటలో పరిచయం అయిన ప్రియుడి కోసం సీమా హైదర్ భారత్ కు వచ్చింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2025, 02:12 PM IST
  • ఉగ్రదాడిపై దేశంలో మిన్నంటిన నిరసనలు..
  • మోదీకి సీమా హైదర్ స్పెషల్ రిక్వెస్ట్..
Seema Haidar:  భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..

seema Haidar special request to pm modi and cm yogi: జమ్ములోని అనంత్ నాగ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఇప్పటికే పాక్ ను భారత్ అన్నిరకాలుగా దెబ్బతీసేలా చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా సింధు జలాల ఒప్పందం రద్దును భారీ షాక్ గా చెప్పవచ్చు.. ఇక భారత్ లో ఉన్న పాక్ వాళ్లు.. ఈ నెల 29 వరకు వెళ్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది.

Add Zee News as a Preferred Source

అన్ని రకాల వీసాల మీద వచ్చిన వారు.. ఏప్రిల్ 27 లోగా.. మెడికల్ వీసాల మీద వచ్చిన వాళ్లు ఏప్రిల్ 29 డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో ప్రస్తుతం.. పాక్ నుంచి 2023 లో పబ్జీ ఆటలో పరిచయమైన ప్రియుడి కోసం.. భారత్ కు వచ్చిన సీమా హైదర్, యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన  యువకుడు సచిన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. అయితే.. ఈమె ఇప్పటికి నలుగురు పిల్లల తల్లి. భారత్ కు వచ్చిన తర్వాత ప్రియుడితో మరో బిడ్డను కనింది.

అయితే.. తాను ఇప్పుడు భారత్ కు కోడలినని..  ఇక్కడే ఉండిపోతానని.. దయచేసి పాక్ కు పంపొద్దని పీఎం మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ లకు సీమా హైదర్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టుకుంది. సచిన్.. మీనాను వివాహం చేసుకున్న తర్వాత సీమా హైదర్ హిందూ మతాన్ని స్వీకరించింది. ఈ క్రమంలో దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more: Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 22న చోటు చేసుకున్న పహల్గం ఘటనపై యావత్ భారత్ దేశం చాలా సీరియస్ గా ఉంది. ఈ సారి భారత్ కు తప్పకుండా బుద్ది చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగా భారత్.. దుందుడుకుగా ముందుకు వెళ్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు అలుముకున్నాయి.  పాక్, భారత్ బార్డర్ ల వద్ద భారీగా ఇరుదేశాల వైపుల నుంచి బలగాలు పెద్దఎత్తున గస్తీ కాస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News