Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ఖాన్స్ త్రయం సైలెన్స్.. కోట్లు కావాలి కానీ దేశ రక్షణ అక్కర్లేదా..!

Pahalgam Terror Attack: దేశం మొత్తం జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తోంది. అటు ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా కూడా ఈ బాధాకరమైన సమయంలో భారత్ కు అండగా నిలిచాయి. అటు సినీ ప్రముఖులు, క్రికెటర్స్ అందరు ఈ ఉగ్రచర్యను ఖండించారు. కానీ కోట్లు తీసుకునే బాలీవుడ్ ఖాన్స్ త్రయంగా చెప్పుకునే ఈ హీరోలు మాత్రం ఉగ్రదాడిపై కనీసం స్పందించకపోవడంపై నెటిజన్స్ అసలు వీళ్లు హీరోలేనా అని మండిపడుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 23, 2025, 10:31 AM IST
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ఖాన్స్ త్రయం సైలెన్స్.. కోట్లు కావాలి కానీ దేశ రక్షణ అక్కర్లేదా..!

Pahalgam Terror Attack: నిన్న  మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలో  జరిగిన ఉగ్రదాడిలో దాదాపు ౩౦ మంది  చనిపోయారు. ఇందులో ఇద్దరు విదేశీయులున్నారు.  ఇందుకు పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ఉత్రవాదులు ఈ  దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం . కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి  వారు పారిపోవడంతో భద్రతా సిబ్బంది  వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్రకు దేశ వ్యాప్తంగా  పెద్ద సంఖ్యలో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఈ ముష్కర మూకలు ఈ దాడికి తెగపడినట్టు తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source

కశ్మీర్ లోయలో  జరిగిన ఈ దుర్ఘటనపై దేశ వ్యాప్తంగా  సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఎక్స్ లో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకునే ఖాన్ త్రయం అదేనండి.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోలు కనీసం ఈ ఘటనపై స్పందిచనూ లేదు. ఇందులో ఆమీర్ ఖాన్.. సామాజిక మాధ్యమాల నుంచి బయటకు వచ్చేసారు. ఆయన్ని మినహాయిస్తే.. మిగతా ఈ హీరోల్లో ఎవరు కనీసం స్పందించనైనా స్పందించకపోవడం శోచనీయం అంటున్నారు.

ఇప్పటికే ఘటన జరిగి దాదాపు 20 గంటలు కావొస్తోంది. అయినా.. ఈ హీరోలెవ్వరు కనీసం ఈ ఘటనపై స్పందించలేదు. అసలు ఎక్స్ లో ఏదోదో పోస్ట్ చేసే వీరు కనీసం ఉగ్రదాడిని ఖండించడానికి కనీసం సమయం లేదా.. అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మన దేశ పౌరుల సొమ్ముతో సూపర్ స్టార్స్ అయినా.. వీళ్లు ఇలాంటి ఆపద సమయంలో కనీసం స్పందించకపోవడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి వాళ్లనా.. మేము హీరోలు ఆదిరించిందని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఈ హీరోలు ఎక్స్ లో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూపై స్పందిస్తూ ఉంటారు. దేశం పై ఉగ్రదాడి జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో కనీసం స్పందించరా అని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి  దీనిపై ఈ హీరోలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News