The Resistance Front: మన దేశంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని జరిగిన ఉగ్రదాడి వెనక
‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ మధ్యనే ఏర్పాటు అయింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇది ఏర్పడింది. ముందుగా ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ - TRF చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించిందని సమాచారం.
2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎఫ్ దాడులకు తెగబడుతోంది. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. 2023లో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. టీఆర్‌ఎఫ్‌ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతడు కశ్మీరీ మిలిటెంటు. శ్రీనగర్‌లో ప్రముఖ జర్నలిస్టు అయిన షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి సజ్జద్ కుట్ర పన్నినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కార్యకలాపాల కారణంగా పలు చట్టాల కారణంగా సజ్జాద్‌ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తయ్యిబా కమాండర్‌గా పని చేశాడు. టీఆర్‌ఎఫ్‌లో పనిచేసే వారిలో సాజిద్ జాట్, సలీం రెహ్మానీ ఉన్నారు. వీరిద్దరూ గతంలో లష్కరేలో పనిచేశారు
తాజాగా ఈ ఘటన పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగింది. అక్కడున్న వాళ్లలో ఐడీ కార్డులతో పాటు వాళ్ల నుదిటిపై బొట్టు ఆధారంగా ముస్లిమేతరులను టార్గెట్ చేసి మరి చంపారు. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్ర విషయంలో హిందువులు ఎక్కువగా రిజిస్ట్రిషేర్ చేసుకున్న నేపథ్యంలో వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ఉగ్రవాదులు ఈ దాడికి తెగపడినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి వారు పారిపోవడంతో భద్రతా సిబ్బంది వీరి గురించి తీవ్రంగా గాలిస్తున్నారు. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









