Deadline for Pakistan: ఏప్రిల్ 29 వరకే గడువు, ఆ తరువాత కన్పిస్తే కఠిన చర్యలు తప్పవు

Deadline for Pakistan: పహల్గావ్ ఉగ్రదాడి తరువాత దాయాది దేశం పాకిస్తాన్‌ను ఇండియా పూర్తిగా వెలివేసింది. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలు తెంపుకుంది. అందుకే ఈ నెల 29 తరువాత ఆ దేశస్థులు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 26, 2025, 12:03 PM IST
Deadline for Pakistan: ఏప్రిల్ 29 వరకే గడువు, ఆ తరువాత కన్పిస్తే కఠిన చర్యలు తప్పవు

Deadline for Pakistan: పహల్గావ్ ఉగ్రదాడి అనంతరం ఇండియా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంది. ఆ దేశస్థులు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 గడువు తేదీ విధించింది. ఆ తరువాత కూడా ఉంటే అరెస్టులు తప్పవు. 

Add Zee News as a Preferred Source

పహల్గావ్ ఉగ్రదాడి నేపధ్యంలో ఇండియా ప్రత్యర్థి దేశం పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకుంది. దేశంలో వివిధ పనుల నిమిత్తం లేదా చదువు కోసం లేదా వైద్య అవసరాల కోసం ఇండియాకు వచ్చి ఉన్న పాకిస్తానీయుల్ని తక్షణం దేశం విడిచి వెళ్లిపోవల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పాకిస్తానీయులకు జారీ అయిన వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో దేశం విడిచి పోవాలని స్పష్టం చేసింది. వైద్య అవసరాల కోసం ఉన్నవారికి మాత్రం హ్యుమానిటీలో భాగంగా కొద్దిగా గడువు ఇచ్చింది. ఈ నెల 29 వరకూ వీసాలు చెల్లుబాటు కానున్నాయని తెలిపింది. ఆ తరువాత వీసాలు పనిచేయవని స్పష్టం చేసింది. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో ఇండియా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రకాల వీసాలు రద్దు చేసింది. ఈ నెల 29 తరువాత ఏ వీసా కూడా పనిచేయదు. ఇకపై పాకిస్తానీయులకు వీసాలు కూడా మంజూరు కావు. ఈ నెల 29 లోగా దేశం విడిచి వెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. సాధారణ వీసాలు ఈ నెల 27 తరువాత పనిచేయవని తెలిపింది. మెడికల్ వీసాలకు మాత్రం ఈ నెల 30 వరకూ గడువు ఉంటుంది. ఇక అటారీ బోర్డర్ కూడా ఈ నెల 30 వరకే తెరిచి ఉంటుంది. 

మరోవైపు రెండు దేశాల మధ్య ఉన్న నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా సింధూ నది జలాల్ని నిలిపివేసింది. మరోవైపు సరిహద్దుల్లో ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమం నడుస్తోంది.

Also read: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఏకమైన ప్రజలు.. కులమతాలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News