)
Seema Haidar to be sent back Pakistan: పహాల్గం ఘటనను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. పాక్ ను భారత్ అష్ట దిగ్బంధనం చేసింది. ముఖ్యంగా భారత్.. పాక్ వీసాలను రద్దు చేసింది. భారత్ లో ఉన్న పాక్ వాళ్లు. 48 గంటల్లో వెళ్లిపొవాలని ఆదేశించింది. అటారీ బార్డర్ ను మూసి వేసింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. దౌత్యధికారుల్ని కుదించుకుని, వెనక్కురప్పించుకుంది.
ఈ క్రమంలో గతంలో పాక్ లోని సింద్ ప్రావీన్స్ కు చెందిన సీమా హైదర్ 2019లో ఆన్లైన్ గేమ్ ద్వారా ఉత్తర ప్రదేశ్, నోయిడాకు చెందిన సచిన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది . అది కాస్త ప్రేమగా మారడంతో.. ఆమె తన నలుగురు పిల్లలతో సహా భారత్ కు వచ్చింది.
ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. అదే విధంగా..ప్రియుడు, సచిన్ తో ఒక పాపను కూడా కనింది.వీసాల రద్దు నేపథ్యంలో సీమా హైదర్ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీమా హైదర్ ఇండియాలో ఉంటుందా?..లేదా పాక్ కు వెళ్లిపోతుందా..అని రచ్చ జరుగుతుంది.
ఇండియన్ సిటిజన్ ను పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డను కనింది.. ఇక్కడ ఉండిపోతుందా..లేదా...వెళ్లాల్సి ఉంటుందా.. అన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు. మొత్తంగా సీమా హైదర్ ఘటన వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe