India Pakistan Ceasefire: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంపై ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ మరోసారి తోక ముడిచింది. పహల్గమ్ ఉగ్రవాద సంఘటనతో భారతదేశం చేస్తున్న దాడులకు బెంబేలెత్తిపోయింది. సైనిక స్థావరాలను విధ్వంసం చేస్తుండడంతో గజగజ వణికిపోయింది. తాము చేస్తున్న డ్రోన్ల వర్షాన్ని భారత్ దీటుగా తిప్పికొట్టడమే కాకుండా సొంత గడ్డపైన కూడా భారతదేశం పైచేయి సాధిస్తోంది. ఏ విధంగా చూసినా కూడా భారతదేశంతో విఫలమవుతున్న పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో చేతులు ఎత్తేసింది. భారతదేశంతో పోరాడలేమని నిర్ణయించుకుని వెంటనే అమెరికాతో సంప్రదింపులు చేసి కాల్పుల విరమణకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. భారత్ దెబ్బకు మూడు అంటే మూడు రోజులు మాత్రమే తట్టుకోలేకపోయింది. భారత్ దెబ్బకు అమెరికాను మధ్యలోకి తీసుకువచ్చి యుద్ధాన్ని తాత్కాలికంగా విరమింపజేసుకుంది.
Also Read: Donald Trump Tweet: డొనల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ముగిసిన భారత్, పాక్ యుద్ధం
విస్తీర్ణపరంగా.. జనాభాపరంగా.. ఆర్థికపరంగా.. సాంకేతికపరంగా అన్నింటా భారతదేశంతో పాకిస్థాన్ పోటీ పడలేదు. అసలు భారత్‌లోని రెండు, మూడు రాష్ట్రాలు కలిపినట్టు ఉండే పాకిస్థాన్ మనతో ఏమాత్రం సరితూగదు. ఇక సైనికపరంగా కూడా భారత్ ముందు పాకిస్థాన్ జుజుబీ. అలాంటి పాకిస్థాన్ యుద్ధానికి కాలు దువ్వితే భారత్ పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదులను ఉసిగొల్పి ఉద్రిక్తతలకు దారితీసినా పోనీ అని వదిలేస్తుంటే పహల్గమ్‌లో ఉగ్రదాడి చేసింది. ఎన్నాళ్లు భరించాలని భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. దీనికి దెబ్బకు గిలగిలలాడిన పాకిస్థాన్ అతికష్టంగా రెండు, మూడు రోజులు దాడులు చేసింది.
Also Read: Murali Nayak Rituals: వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు రేపు.. అంతిమ యాత్ర షెడ్యూల్ ఇదే!
ఏనుగుపై ఈగలు వాలినట్టు భారతదేశం పాకిస్థాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా పాకిస్థాన్ గడ్డపై ఆ దేశ సైనిక స్థావరాలను విధ్వంసం చేయడంతో పాకిస్థాన్ నడ్డి విరిగింది. టర్కీ, చైనాకు చెందిన ఆయుధాలను భారత సాయుధ దళాలు విధ్వంసం సృష్టించాయి. రెండు రోజులు చేసిన భారత్ దాడులకు శత్రు దేశం తట్టుకోలేకపోయింది. భారత్ మరికొన్ని రోజుల్లో తీవ్ర స్థాయి నిర్ణయాలు తీసుకుంటుందనే భయంతో వెంటనే పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. రెండు రోజుల దెబ్బకు పాకిస్థాన్ తోక ముడుచుకుంది. కాల్పులను విరమించుకుంటామని పాకిస్థాన్ ముందుకు వచ్చింది. అమెరికాను తీసుకువచ్చి భారత్‌తో చర్చలు జరిపింది. మేం విరమిస్తాం మీరు ఆపండి అని ప్రాధేయపడింది. భారత్‌తో పోరాడలేక చేతులెత్తయడం చూస్తుంటే పాకిస్థాన్ ఎంతలా భయపడుతుందో అర్థమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.