Pakistan Opens Firing: పాక్ సైనికులు కాల్పులు మొదలు పెట్టారు. సీజ్‌ఫైర్ ఎత్తివేయడంతో సరిహద్దుల గుండా పాకిస్తాన్ సైనికులు భారత్ వైపుగా కాల్పులకు తెగబడ్డారు. ఈనేపథ్యంలో భారత సైనికులు కూడా వారికి దీటుగా జవాబు ఇస్తున్నారు. ఈ మేరకు సైరిక వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల వెంబడి ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ దుశ్చర్య మరింత అలజడి సృష్టించేలా ఉంది. పాక్ సైనికులు కాల్పులకు తెగబడటంతో భారత్ కూడా అంతే దీటుగా జవాబు ఇస్తోంది. గురువారం రాత్రి నుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయింది. పహల్గాంలో భారత టూరిస్టులను దారుణంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. అటారీ బార్డర్ కూడా మూసివేసింది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 27 మంది అమాయకులు చనిపోయారు.
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు రష్యా అధ్యక్షుడు కూడా మద్ధతు భారత్‌కు తెలిపారు. ప్రపంచ దేశాల నేతలు కూడా పహల్గాం నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్ధతిస్తామని చెప్పాయి. యూకే ఎంపీ బాబ్ బ్లాక్‌మెన్ కూడా ఇటీవలె స్పష్టం చేశారు. ప్రధానంగా ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యక్షన్ చేపట్టినా తన పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పీఎం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్‌కు తమ ఉంటుంది స్పష్టం చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారన్నా సమాచారంతో కుల్నార్ ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో వారిపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.దీంతో భారత్ జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు ఎల్‌ఓసీ వద్ద కూడా భారత ఆర్మీ కట్టుదిట్టంగా పహారా కాస్తోంది. ఇదిలా ఉండగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరికాసేపట్లో శ్రీనర్ ఉదమ్‌పూర్‌కు చేరుకోనున్నార. సీనియర్ కమాండర్లతో భేటీ అయి పరస్థితులను ఆరా తీయనున్నారు. తదుపరి చర్యలకు కూడా దిశానిర్ధేశం చేయున్నారు ద్వివేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









