Pak pm shehbaz sharif reacts On Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు.ఈ ఘటనపై భారత్.. పాక్ పై నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. అదే విధంగా ఎలాంటి చర్యలు ఎదుర్కొనేందుకు అయిన తాము సిద్దమని ప్రగల్గాలు పలికాడు.
అంతే కాకుండా.. దీనిపై పూర్తిస్థాయిలో న్యూట్రల్ విచారణకు సిద్దమన్నారు. ఈ క్రమంలో పహల్గం ఘటన జరిగిప్పటి నుంచి పాక్ ప్రధాని దీనిపైన తొలిసారి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటికే పాక్ ఉపప్రధాని, మంత్రులు భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్ అడ్డాంగా దొరికిపోయిన కూడా.. తప్పుచేయలేదని చెప్పడం కొత్తకాదని భారత్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది.
ఇదిలా ఉండగా.. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాక్ మిలిటరీ అకాడమి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత్, పాక్ ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై మాట్లాడారు. పహల్గం ఘటనతో మనదేశం నిందలు ఎదుర్కొంటుందన్నారు. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక , విచారణకు సిద్దమన్నారు. తమ దేశం శాంతికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని చెప్పారు.
అదే విధంగా భారత్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తమ దేశ సార్వభౌమత్వంపై రాజీ పడేది లేదన్నారు. తమదేశం కోసం ఎలాంటి ముప్పు అయిన ఎదుర్కొనేందుకు సిద్దమన్నారు. సింధు జలాల ఒప్పందపై మాట్లాడుతూ.. భారత్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొవడం సరికాదన్నారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకొవాలని తాము కోరుకుంటున్నట్లు భారత్ ను మళ్లీ నిందించే ప్రయత్నంను పాక్ ప్రధాని చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









