Pakistan Spy: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లో వరుసగా పట్టుబడుతున్న పాకిస్థాన్ గూఢచారులు..

Pakistan Spy Arrest: దేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2025, 02:20 PM IST
Pakistan Spy: ఆపరేషన్ సింధూర్ తర్వాత  భారత్ లో వరుసగా పట్టుబడుతున్న పాకిస్థాన్ గూఢచారులు..

Pakistan Spy Arrest: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సరిహద్దుల వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఐఎస్ఐకి అందించారనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దు వెంబడి భారత సైన్యానికి సంబంధించిన వివరాలను ఇతను పాకిస్తాన్‌కి చేరవేస్తున్నట్లుగా తెలుస్తోంది.గగన్‌దీప్ సింగ్ గత5 ఏళ్లుగా పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇతని ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు పరిచయం అయ్యాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతడికి భారతీయ మార్గాల ద్వారా PIOల నుంచి డబ్బులు అందుకున్నాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

Add Zee News as a Preferred Source

పాకిస్తాన్ నాన్‌కానా సాహిబ్‌కి చెందిన ఖలిస్తానీ అనుకూల నాయకుడు గోపాల్ సింగ్ చావ్లా తరుచుగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటాడు. మతపరమైన కార్యక్రమాల్లో పాకిస్తాన్‌ని సందర్శించేందుకు వచ్చే భారతీయుల్లో సాఫ్ట్ టార్గెట్స్‌‌ని గుర్తించే బాధ్యతను ఐఎస్ఐ చావ్లాకు అప్పగించింది. జమాత్ ఉద్ దావా, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి చావ్లా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు.

గగన్ గత 5 ఏళ్లుగా చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని వెల్లడించారు. పాకిస్తాన్‌కి సమాచారం అందించిన మొబైల్ ఫోన్‌ను, అలాగే 20 ఐఎస్ఐ కాంటాక్ట్స్ వివరాలను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గూఢచార నెట్వర్క్‌ని ఛేదించడానికి దర్యాప్తు జరుగుతోంది. గగన్‌కి ముందు 2019లో జలంధర్ పోలీసులు భటిజా గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ పాలాను అరెస్ట్ చేశారు. ఇతను ఐఎస్ఐ ఏజెంట్ చావ్లాకు కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని అందించారు.

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News