Pak Anchor on Operation sindoor Video: ఇప్పుడు నొప్పి తెలుస్తుందా..?.. పాక్ యాంకర్‌పై నెట్టింట ట్రోలింగ్.. వీడియో వైరల్..

Pak lady anchor on India war on Pakistan : ఇండియన్ ఆర్మీ పాక్ పై దాడికి దిగింది. పహల్గం దాడికి కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలో పాక్ కు చెందిన ఒక లేడీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : May 7, 2025, 01:15 PM IST
  • ఏడ్చిన పాక్ యాంకర్..
  • ట్రోలింగ్ చేసిన నెటిజన్లు..
Pak Anchor on Operation sindoor Video:  ఇప్పుడు నొప్పి తెలుస్తుందా..?.. పాక్ యాంకర్‌పై నెట్టింట ట్రోలింగ్.. వీడియో వైరల్..

India war Attacks on Pakistan Operation sindoor latest news: జమ్ము కశ్మీర్ లోని పహల్గంలో  అమాయకులైన టూరిస్టులపై ఆర్మీదుస్తులో వచ్చిన టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్పులకు తెగబడ్డారు. 26 మంది టూరిస్టుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఏప్రిల్ 22న దేశంలోని టూరిస్టులు తమ కుటుంబాలతో సరదాగా గడిపేందుకు పహల్గంకు వచ్చారు.  ఈ క్రమంలో ఉగ్రవాదుల పక్కా సమాచారం మేరకు.. టూరిస్టుల్ని పొట్టన పెట్టుకున్నారు. కేవలం హిందువుల్ని మాత్రమే టార్గెట్ తీసుకుని మరీ దాడులు చేశారు.  

Add Zee News as a Preferred Source

 

ఈ నేపథ్యంలో... యావత్ భారతావణి దీనిపై మండిపడింది. ప్రధానిమోదీ ఈ ఘటనపై త్రివిధ దళాలకు పూర్తిగా ఫ్రీహ్యాండ్ ఇచ్చారు.  ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 1.30 నిమిషాల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లొని ఉగ్రస్థావరాలపై విరుచుకు పడింది. అయితే.. మొత్తంగా.. భారత్ జరిపిన దాడుల్లో 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే.. భారత్ దాడులకు తట్టుకోలేక పాక్ కు చెందిన ఒక లేడీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  తమదేశంపై ఇండియా దాడి చేస్తుందని, చాలా మంది పాక్ కు చెందిన పౌరులు చనిపోయారని తమను ఆదుకొవాలని పాక్ కు చెందిన లేడీ యాంకర్ మొసలి కన్నీళ్లు పెట్టుకుంటు ఒక వీడియోను రిలీజ్ చేసింది.

ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడతున్నారు. భారత్ దేశానికి చెందిన టూరిస్టులు, హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని మరీ దాడులకు దిగినప్పుడు.. ఈ బాధ మీకు తెలియలేదా అని నెటిజన్లు మండిపడుతున్నారు. కొత్తగా పెళ్లైన వాళ్ల భర్తల్ని, తమ వాళ్ల ముందు తమ కుటుంబ సభ్యుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపినప్పుడు వారు అనుభవించిన మానసిన వేదన తెలియలేదా.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more: Operation Sindoor: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సిన్మా ముందుంది.. భారత్ మాజీ ఆర్మీ చీఫ్ సంచలన పోస్ట్..

తమ దేశంమీద ఇప్పటికే పాక్ ఎన్నోసార్లు ఉగ్రవాదుల్ని ఉసిగొల్పిదాడులకు పాల్పడినప్పుడు.. మా పౌరులు పడిన వేదన మీకు తెలియలేదా అని కౌంటర్ లు ఇస్తున్నారు. ఏదీఏమైన భారత్ పాక్ పై ఆపరేషన్ సిందూర్ రూపంలో తీసుకున్న ప్రతీకారంను యావత్ భారతావణి స్వాగతిస్తుంది. పాక్ కు గట్టిగానే బుద్ది చెప్పారని కూడా ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News