Pan Card: బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇలా అన్నింటికీ పాన్ కార్డు చాలా కీలకమైంది. ఇంత కీలకమైన పాన్ కార్డు మరింత సెక్యూర్‌గా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో అందరికీ పాన్ కార్డు 2.0 మాత్రమే జారీ అవుతుంది.
పాన్ కార్డు 2.0 అనేది అత్యంత సెక్యూరిటీ కలిగింది. ఏటీఎం కార్డు పరిమాణంలోనే ఉంటుంది. కానీ వివరాలేవీ బహిర్గతంగా ఉండవు. క్యూఆర్ కోడ్ ఉంటుంది. చిప్ ఉంటుంది. సైబర్ మోసాలు, పాన్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కొత్త పాన్ కార్డు తీసుకొచ్చింది. కొత్త పాన్ కార్డులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది. సాధారణ పాన్ కార్డులో పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలు బహిర్గతంగా ఉంటాయి. కొత్త పాన్ కార్డులో అన్ని వివరాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి.
అయితే పాత పాన్ కార్డు పరిస్థితి ఏంటనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. కొత్త పాన్ కార్డులు అందుబాటులో వస్తే పాతవి పనిచేస్తాయా లేవా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కొత్త పాన్ కార్డులు అందుబాటులో వచ్చినా పాతవి యధాతధంగా పనిచేస్తాయి. సైబర్ మోసాల్ని అరికట్టేందుకే కొత్త పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
పాన్ 2.0 ఎలా అప్లై చేయాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబ్, ఈ మెయిల్ వివరాలు నమోదు చేయాలి. చివరిగా సబ్‌మిట్ చేయాలి. ఆ తరువాత మీ వివరాలు సరి చూసుకోవాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. నిర్ధారిత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించి సబ్మిట్ చేస్తే చాలు మీ పాన్ కార్డు మీ మెయిల్ ఐడీకు వస్తుంది.
Also read: JEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









