Pan Card 2.0: పాన్ కార్డు 2.0 కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి

Pan Card 2.0: ప్రస్తుతం దేశంలో అందరికీ అవసరంగా మారిన డాక్యుమెంట్ పాన్ కార్డు. ఇది లేనిదే ఎలాంటి లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. ఈ క్రమంలో పాన్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2025, 05:32 PM IST
Pan Card 2.0: పాన్ కార్డు 2.0 కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి

Pan Card 2.0: దేశంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యంగా మారింది. ట్యాక్స్ చెల్లింపులు, ఐడీ ప్రూఫ్, భారీగా నగదు లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు పాన్ కార్డు చాలా అవసరం. అయితే ఇన్‌కంటాక్స్ శాఖ ఇప్పుడు కొత్తగా పాన్ 2.0 లాంచ్ చేసింది. ఇది ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలనే వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పాన్ 2.0 అనేది పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో, మరింత సెక్యూరిటీని అందించే విధంగా రూపుదిద్దుకుంది. ఇందులో చాలా వివరాలు బహిర్గతంగా ఉండవు. క్యూఆర్ కోడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. కొత్త పాన్ 2.0 లో భాగంగా ఇ పాన్ కార్డులు పీడీఎఫ్ రూపంలో రిజిస్టర్డ్ మెయిల్‌కు పంపిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే భౌతికంగా అంటే ఫిజికల్ కార్డు కావాలంటే నామినల్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుని పొందవచ్చు. అలాగని పాత పాన్ కార్డులు చెల్లవని కాదు. పాతవి కూడా కచ్చితంగా చెల్లుతాయి. పాన్ 2.0ప్రాజెక్టులో భాగంగా పాన్ కార్డు అప్‌డేట్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇ పాన్ అనేది మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకు వస్తుంది. 

Pan 2.0 ఎలా అప్లై చేసుకోవాలి

ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్ https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html  ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. ఓటీపీతో ధృవీకరించుకోవాలి. నిర్ణీత రుసుము చెల్లించాలి. ఇ పాన్ అయితే ఎలాంటి ఫీజు ఉండదు. ఇ పాన్ కేవలం 30 నిమిషాల వ్యవధిలో మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకు వచ్చేస్తుంది. ఫిజికల్ పాన్ కార్డు 2.0 కోసం 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విదేశాలకు డెలివరీ చేసేందుకు అయితే 15 రూపాయలు అదనంగా చెల్లించాలి. 

Also read: JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎప్పటి వరకంటే>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News