Pan Card-Aadhaar: వివిధ రకాల ప్రభుత్వ పనులకు పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్ అనేది తప్పనిసరిగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచింది. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంట్లో కూర్చుని సెకన్ల వ్యవధిలో ఆన్‌లైన్‌లో లింక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్ కార్డు - ఆధార్ కార్డు గడువు పెంచింది. ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ 31 వరకూ రెండింటినీ అనుసంధానం చేసుకునేందుకు వీలుంది. ఈలోగా మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానించకపోతే మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ కాగలదు. గడువు తేదీ తరువాత పాన్ కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం చేయాలంటే 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంక్ సంబంధిత పనులు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ , ఇతర ఆర్ధిక లావాదేవీలకు కష్టం కావచ్చు. అందుకే ఆధార్ కార్డుతో తక్షణం పాన్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఆధార్ కార్డు లింకింగ్ చాలా సులభం.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం ఎలా
ముందుగా ఇన్‌కంటాక్స్ అధికారిక వెబ్‌సైట్ www.inmcoetax.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు అక్కడ కన్పించే లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఓటీపీ ధృవీకరణతో పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం పూర్తయిపోతుంది.
ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డు-పాన్ కార్డు లింక్ చేయడం ఎలా
ముందుగా ఇన్‌కంటాక్స్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లు అంటే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని ఇన్‌కంటాక్స్ ఆఫీసుకు వెళ్లాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై సంతకం చేసి సమర్పించాలి.
Also read: Public Holiday: ఏప్రిల్ 18 బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









