Pan Card: పాన్ కార్డు ఒక్కోసారి డీయాక్టివేట్ అవుతుంటుంది. మీ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి కీలకమైన పనులు కష్టమౌతుంటాయి. అందుకే పాన్ కార్డు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేట్టు చూసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ అయితే ఎలా తెలుసుకోవచ్చు, తిరిగి యాక్టివేట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం.
పాన్ కార్డు డీ యాక్టివేట్ కావడానికి మూడు కారణాలుంటాయి. ప్రధానమైంది ఆధార్ కార్డుతో లింక్ కాకపోవడం. రెండవది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం. మూడవది నకిలీ పాన్ కార్డు ఉండటం. మీ పాన్ కార్డు యాక్టివ్ మోడ్‌లో ఉందో లేక డీ యాక్టివేట్ అయిందో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా ఇన్‌కంటాక్స్ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎడమ వైపు కన్పించే క్విక్ లింక్ విభాగంలో Verify Pan Status ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అంతే మీ పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో స్క్కీన్‌పై కన్పిస్తుంది.
పాన్ కార్డు యాక్టివేట్ చేయడం ఎలా
మీ పాన్ కార్డు ఒకవేళ డీ యాక్టివేట్ అయి ఉంటే ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పెనాల్టీ బాండ్ పూర్తి చేయాలి. గత మూడేళ్లుగా డీ యాక్టివేటెడ్ పాన్‌తో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ పత్రాల్ని మీరు రీజనల్ ఇన్కంటాక్స్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. 15 రోజుల్లో మీ పాన్ కార్డు యాక్టివ్ అవుతుంది.
Also read: Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









