Parliament monsoon session schedule amid opeation sindoor issue: ప్రస్తుతం దేశంలొ ప్రతిపక్షాపార్టీలన్ని ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో చర్చలు జరపాలని, వెంటనే పార్లమెంట్ ను సమావేశ పర్చాలని డిమాండ్ లను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కేంద్రం అనూహ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. ముఖ్యంగా.. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ పై, అపోసిషన్ పార్టీలు కీలక ప్రశ్నలు కేంద్రంపైసంధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై ఆపరేషన్ సిందూర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల.. పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందంకు మోదీ అంగీకరించారని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్ని ఏర్పాటు చేయాలని అపోసిషన్ పార్టీలు చేసిన డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
ఈ సమావేశంలో ముఖ్యంగా.. జమ్ములోని పహల్గం, ఆపరేషన్ సిందూర్ పై వాడివేడి చర్చలు ఉండనున్నాయని స్పష్టంగా తెలుస్తొంది. అయితే.. మూడు నెలలకు పైగా విరామం తర్వాత, పార్లమెంటు ఉభయ సభలు జూలై 21న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేసిందని రిజిజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఏప్రిల్ 4 న నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పార్లమెంట్ లో చర్చలు జరపున్నారు. అదే విధంగా.. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని కూడా వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









