Patanjali Ayurveda: భారత దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ నుంచి మూడో స్థానానికి ఎగబాకుతోంది. అంతేకాదు ప్రపంచ మొత్తం ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న మన దేశం మాత్రం అత్యంత వేగంగా పరుగులు పెడుతుంది. దీని వెనక స్వదేశీ కంపెనీల సహాకారం మరవలేనిదనే చెప్పాలి. మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ముంచెత్తున్నాయి. ముఖ్యంగా స్వదేశీని స్వీకరించి దేశంలోనే తమ ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీల్లో పతంజలి సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది స్వదేశీ ఉద్యమం అంటే మన స్వంత వస్తువులను ప్రోత్సహించడం. ఇందులో పతంజలి సంస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నేడు, పతంజలి ఈ ఉద్యమాన్ని కొత్త శిఖరాకులకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తుల ద్వారా బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ నాయకత్వంలో పతంజలి సంస్థ ఇంతింతై అన్నట్టుగా సాగిపోతుంది. ప్రస్తుతం పతంజలి భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీల జాబితాలో ముందు వరుసలో ఉంది. అలాగే, వేగంగా అమ్ముడవుతున్న వినియోగ వస్తువుల రంగంలో ముందు స్థానంలో నిలుస్తోంది. పతంజలి వస్తువల కారణంగా పెద్ద విదేశీ కంపెనీలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి.
ఆర్థిక సహకారం మరియు ఉపాధి అవకాశాలు..
మీడియా నివేదికల ప్రకారం,2023-24 సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద నికర ఆదాయం రూ.9,335.32 కోట్లు. ఇది గత యేడాది కంటే 23.15% కంటే ఎక్కువ. అదే సమయంలో, పతంజలి ఫుడ్స్ ఆదాయం 2023లో రూ. 31,800 కోట్లుగా ఉంది, ఇది ఈ కంపెనీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందు వరుసలో ఉంది.
పతంజలి ఆదాయం, లాభం నిరంతరం ఎగబాకుతూనే ఉంది. దేశంలోని అగ్రశ్రేణి FMCG కంపెనీలలో ఒకటైన పతంజలి దినదినాభివృద్ధి చెందుతుంది. అంతేకాదు తమ కంపెనీతో ఎంతో మందికి ఉపాధి కల్పన, స్వదేశీ ఉత్పత్తులపై ప్రేమ మమకారం కల్పించడంతో ముందు వరుసలో ఉంది. పతంజలి ప్రత్యేకమైన వ్యాపార నమూనాతో పాటు తక్కువ ధరల కారణంగా, ఇది FMCG, ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
అంతేకాదు మన దేశ యువతకు ఉపాధి అవకాశాలను అందించడంలో పతంజలి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా 10,000 ఆరోగ్య కేంద్రాలు, 4,500 పంపిణీదారుల ద్వారా 6,38,735 గ్రామాలకు పతంజలి ప్రొడక్ట్స్ ప్రజలకు చేరువ అవుతున్నాయి. దీనివల్ల గ్రామాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. అలాగే, వారు తమ పరిధిని 10 లక్షల కిరాణా దుకాణాలకు విస్తరించారు. ఆధునిక వాణిజ్య దుకాణాలలో పతంజలి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. దీనివల్ల చిన్న దుకాణదారులు, పంపిణీదారులు ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
చౌకైన మరియు స్వదేశీ ఉత్పత్తులు..
పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తుల్లో ఆమ్లా రసం, ఆవ నూనె, ఆవు నెయ్యితో పాటు అనేక ఇతర రోజువారీ ఉపయోగ వస్తువులు చౌకగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఆయుర్వేదంగా ఇవి ఆరోగ్యానికి మంచివి. చాలా ఉత్పత్తులు పోటీ కంపెనీల కంటే చౌకగా అందివ్వడతో పాటు నాణ్యతగా ఉండటంతో ప్రజలు పతంజలి ఉత్పత్తులను కొనడానికి మొగ్గు చూపుతున్నారు.
దేశం మరియు సంస్కృతి యొక్క గర్వం
పతంజలి మన సంస్కృతిని సజీవంగా ఉంచడంలో దోహదం చేస్తోంది. ఎందుకంటే అది మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగమైన ఆయుర్వేదంపై దృష్టి పెడుతుంది. డబ్బు సంపాదించడమే కాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే తమ లక్ష్యమని పతంజలి కంపెనీ విశ్వసిస్తుంది. ఇది దేశ గౌరవాన్ని పెంచడంలో దోహదం చేస్తోంది.
పతంజలి చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సహాయం చేస్తోన్న పతంజలి..
పతంజలి అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంది. ఆ కంపెనీ తన ఉత్పత్తులకు ముడి పదార్థాలను స్థానిక రైతులు, చిన్న వ్యాపారవేత్తల నుండి సేకరిస్తుంది. ఇది గ్రామాల ఆర్థిక వ్యవస్థను పెంచడంలో దోహదం చేస్తోంది. దీనితో, రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. అంతేకాదు వారి ఆదాయంలో పెరుగుదల నమోదు అయింది. ముఖ్యంగా పతంజలి నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో కొత్త కర్మాగారాలతో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది, ఇది ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ముందు వరుసలో ఉంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









